Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తూ విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనతలు సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా..కెప్టెన్ గా ఆరు డబుల్ సెంచరీలు నమోదుచేసిన తొలి క్రికెటర్ గా రికార్డుల కెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు డబుల్ సెంచరీ పూర్తిచేయడం ద్వారా విరాట్ ఈ ఘనత సాధించాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీ ద్వారా బ్రియాన్ లారా రికార్డును సమంచేసిన కోహ్లీ మూడో టెస్ట్ లో మరో డబుల్ సెంచరీ పూర్తిచేసుకుని…
తాను ఒకే ఒక్కడినని నిరూపించుకున్నాడు. 2016కు ముందు ఒక్క డబుల్ సెంచరీ కూడా నమోదుచేయని కోహ్లీ..కేవలం ఈ రెండేళ్ల వ్యవధిలోనే ఆరు డబుల్ సెంచరీలు పూర్తిచేసి దిగ్గజాల సరసన చేరాడు. ఈ ఏడాది కోహ్లికి ఇది మూడో డబుల్ సెంచరీ. భారత్ తరపున ఆరు డబుల్ సెంచరీలు చేసిన మూడో ఆటగాడు విరాట్. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత కోహ్లీ ఈ ఘనత సాధించాడు. వారిద్దరినీ కూడా కోహ్లీ దాటుకుని వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదు.