ప్రియ‌ద‌ర్శి, న‌భా న‌టేష్ ల “డార్లింగ్ ” కి రిలీజ్ డేట్ ఫిక్స్..!

Release date fixed for Priyadarshi and Nabha Natesh's "Darling".
Release date fixed for Priyadarshi and Nabha Natesh's "Darling".

ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తున్న తాజా మూవీ ‘డార్లింగ్’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్ట‌ర్స్, ‘ఖ‌ల్లాసే’ సాంగ్ ఆడియెన్స్ ని ఆక‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాయి. ఇక ఈ మూవీ కి సంబంధించి మేక‌ర్స్ రిలీజ్ డేట్ ని తాజాగా అనౌన్స్ చేశారు.

పూర్తి కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రానున్న ‘డార్లింగ్’ మూవీ ని జూలై 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ మూవీ ను ద‌ర్శ‌కుడు అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తుండ‌గా, ‘హ‌ను-మాన్’ మూవీ నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Release date fixed for Priyadarshi and Nabha Natesh's "Darling".
Release date fixed for Priyadarshi and Nabha Natesh’s “Darling”.

ఈ మూవీ లో అందాల భామ న‌భా నటేష్ తో పాటు అన‌న్య నాగ‌ళ్ల‌, మొయిన్, శివారెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కు వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు.