యాంకర్ శ్రీముఖి గురించి పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెర మీద అనేక షోస్ లో శ్రీముఖి కనబడి అందరిని ఆకట్టు ఉంటుంది. అందచందాలతో చురకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ అందర్నీ ఆనందింపచేస్తూ ఉంటుంది శ్రీముఖి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీముఖి ఒక వ్యక్తితో ప్రేమగా ఉందట. అయితే శ్రీముఖి ఇంకా ఈ విషయాల మీద ఏమి స్పందించలేదు.
శ్రీముఖి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనే విషయానికి వచ్చేస్తే.. రూ. 1,50,000 వరకు ఆమె ఒక్కో షో కి తీసుకుంటుందంట . షో ని బట్టి లక్ష నుండి లక్ష యాభై వేల వరకు ఆమె తీసుకుంటున్నట్లు తెలుస్తుంది . శ్రీముఖి ఒకవైపు యాంకరింగ్ చేస్తూ ఇంకో పక్క మూవీ ల్లో కూడా కనబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ మూవీ లో కీలకపాత్ర పోషించింది శ్రీముఖి. అలానే ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు వంటి వాటిలో కూడా చాలా చురుకుగా ఉంటుంది శ్రీముఖి. బిగ్ బాస్ కి కూడా వెళ్లి శ్రీముఖి సందడి చేసింది.