పవన్ కళ్యాణ్ వద్దకు ఇటీవలే ఆయన కొడుకు అఖీరా రావడం చర్చనీయాంశం అవుతున్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్‌లు విడాకులు తీసుకున్న తర్వాత చాలా కాలంగా అఖీర తన తల్లి రేణుదేశాయ్ వద్దే ఉంటున్నారు. తాజాగా రేణుదేశాయ్ మరో పెళ్లికి సిద్దం అయిన నేపథ్యంలో అఖీరా తన తండ్రి వద్దకు చేరడంతో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. రేణుదేశాయ్ వివాహం అఖీరాకు ఇష్టం లేదేమో, మరో వ్యక్తిని తండ్రి ప్లేస్‌లో ఊహించుకోవడం ఇష్టం లేక తన తండ్రి వద్దకు వచ్చి ఉంటాడు అనే చర్చ జరుగుతుంది. తండ్రికి గత కొన్నాళ్లుగా అనారోగ్యంగా ఉందని, అందుకే తండ్రిని చూసుకునేందుకు అఖీరా విజయవాడ చేరుకున్నట్లుగా ప్రచారం జరిగింది. మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున వస్తున్న వార్తలపై రేణుదేశాయ్ స్పందించింది.
అఖీరా తన తండ్రి వద్దకు వెళ్లడంపై మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తనకు హాలీడేస్ కావడం వల్లే తండ్రి వద్దకు వెళ్లాడు అని, పూణెలోనే అఖీరా చదువుకుంటాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. హాలీడేస్ ఉన్నన్ని రోజులు అక్కడే ఉంటాడు అని, తండ్రి వద్దకు వెళ్తాను అంటూ తాను అడిగిన సమయంలో తాను ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు అని, అఖీరా పెద్ద వాడు ఎప్పుడైనా, ఎక్కడికైనా తనకు ఇష్టం వచ్చినట్లుగా వెళ్లే స్వేచ్చను తాను ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. తన తండ్రి వద్దకు అఖీరా పూర్తిగా వెళ్లలేదు, నాకు దూరం కాలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలకు రేణుదేశాయ్ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. రేణుదేశాయ్ మరో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పవన్‌తో స్నేహ పూర్వకంగానే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.