పవన్ విషయంలో రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్.!

Renu Desai
Renu Desai

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు చిత్రాలు సహా తన పొలిటికల్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా పవన్ నటించిన చిత్రం ‘బ్రో’. విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి జరిగిన కంట్రోల్స్ కూడా అందరికీ తెలిసిందే అయితే దీని తర్వాత ఏపీ మంత్రి అంబటి పవన్ పై తాను కూడా సీరియస్ తీస్తాను.

అని పవన్ పర్సనల్ లైఫ్ విషయాన్ని ప్రస్తావించారు.అయితే దీనిపై లేటెస్ట్గా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించడం వైరల్ గా మారింది. ప్రతి విషయంలో వ్యక్తిగత జీవితాన్ని లాగొద్దు అని పెళ్లిళ్లు పై చర్చ ఆపాలని వాటిలో తన పిల్లల్ని కాదు వేరే వాళ్ళని కూడా లాగొద్దని చెప్పారు.

ఇది ఒక తల్లి గా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అని అనుకోండి అని తెలిపారు. వాళ్ళు ఇక పిల్లలు అనే వారిని దయచేసి ఈ విషయంలో లాగొద్దని తెలిపారు.అలాగే నా మాజీ భర్తకి పొలిటికల్ పరంగా ఎప్పటికీ సపోర్ట్ చేస్తానని సమాజానికి ఏదోకటి చేయాలని తాను ఎప్పుడు తాపత్రయం పడుతూ ఉంటాడని ఆయనికి నిజంగా డబ్బు మీద ఎలాంటి మోజు లేదు.

అయినా నేను తనతో పర్సనల్ లైఫ్ పరంగా హర్ట్ అయినప్పటికీ ఓలీడర్ గా తనకే ఎప్పటికీ సపోర్ట్ చేస్తాను తను తప్పకుండా పొలిటికల్గా మంచి చేస్తారు అందరూ దానికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ఇది నేను పవన్ మాజీ భార్యగా మాట్లాడటం లేదు సమాజంలో ఓ వ్యక్తిగా చెప్తున్నాను అని రేణు తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.