కడపలో మళ్ళీ అదే మ్యాజిక్ 10 రిపీటా..! అభ్యర్ధులు వాళ్ళే.!

AP Politics: YCP has a big plan for the fourth preparatory meeting.. this time in Palnadu
AP Politics: YCP has a big plan for the fourth preparatory meeting.. this time in Palnadu

కడప కోట వైసీపీ కంచుకోట..ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కడప జిల్లాలో కాంగ్రెస్ 2009 వరకు వైఎస్సార్ హవా నడిచింది. వైఎస్సార్ మరణంతో..ఆయన తనయుడు వైసీపీ పెట్టడంతో కడపలో వైసీపీ వేవ్ మొదలైంది. మొదట పులివెందుల ఉపఎన్నికల,కడప పార్లమెంట్ స్థానాల్లో ప్రభంజనంతో వైసీపీ హవా మొదలైంది. 2012 ఉపఎన్నికల్లో కూడా సత్తా చాటింది.

2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టి‌డి‌పి వేవ్ ఉన్నా సరే కడపలో వైసీపీ జోరు కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే 9 సీట్లు వైసీపీ, ఒక సీటు టి‌డి‌పి గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో చెప్పాల్సిన పని లేదు. 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితులు ఉన్న మళ్ళీ కడపలో వైసీపీ హవా నడవటం ఖాయం..అందులో ఎలాంటి డౌట్ లేదు.

పులివెందులలో జగన్ బరిలో దిగడం..భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. కమలాపురంలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బరిలో ఉంటారు. ఈయన గెలుపు కూడా డౌట్ లేదు. కడపలో డిప్యూటీ సి‌ఎం అంజాద్ బాషా పోటీ చేయడం, గెలవడం ఖాయమే. జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి బరిలో ఉంటారు. ఈయన గెలుపుకు ఢోకా లేదు. రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తారు..ఈయన విజయం వన్‌సైడ్. రైల్వేకోడూరులో కోరుముట్ల శ్రీనివాసులు పోటీ చేయడం ఖాయం. కాస్త టఫ్ ఫైట్ ఎదురుకుంటారు..కానీ ఆధిక్యంలోనే ఉన్నారు.

మైదుకూరులో శెట్టిపల్లి రఘురామిరెడ్డి మళ్ళీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఈయనకు టి‌డి‌పి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ప్రొద్దుటూరులో శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తారు. ఈయన కూడా పోటీ ఎదురుకోవాలి. బద్వేలులో డాక్టర్ సుధా పోటీ చేస్తారా? వేరే వాళ్ళకు సీటు ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. ఇక రాజంపేటలో మేడా మల్లిఖార్జున్ రెడ్డి బరిలో ఉండనున్నారు. ఈయన కూడా టి‌డి‌పి నుంచి పోటీ తప్పదు.