Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయ ప్రయోజనాలు, అధికార కాంక్ష ముందు ఏ బంధం ఎక్కువ కాలం నిలబడలేదని అర్ధం అయ్యింది. నిజానికి ఇప్పుడు రేవంత్ ఆరోపణలు చేస్తున్న పయ్యావుల ఒకప్పుడు ఆయనకి మంచి మిత్రుడు. 2004 నుంచి 2014 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబుకి కంటెంట్ పరంగా పూర్తి స్థాయిలో అండగా నిలిచారు కొందరు యువ నేతలు. వీరిలో రేవంత్, పయ్యావుల, ధూళిపాళ్ల నరేంద్ర, వేం నరేందర్ రెడ్డి ఇంకా క్లోజ్ గా వుండే వాళ్ళు. వై.ఎస్ ని దీటుగా ఎదుర్కొనే రాజకీయ వ్యూహాల్లో చురుగ్గా వుండే ఈ నలుగురిని ఒక్కటిగా చూసినప్పుడు కాంగ్రెస్ నేతలు కొందరు సరదాగా టీడీపీ యంగ్ టర్క్స్ అని పిలిచేవాళ్ళు.
ఆ యంగ్ టర్క్స్ ని రాష్ట్ర విభజన ముందుగా కాస్త దూరం చేసింది. అయినా వీళ్ళు అవకాశం వున్నప్పుడు కలుస్తూనే వుండేవాళ్ళు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మిత్రుడు పయ్యావుల మీదే రేవంత్ ఆరోపణలు చేశారు. దోస్త్ ని జైలుకి పంపినోడు పిలిస్తే మాత్రం వెళ్ళాలా అని రేవంత్ అన్న మాటల్లోనే వారు ఇద్దరూ ఎంత క్లోజ్ అన్నది అర్ధం అవుతుంది. ఇక రెండు వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తూ పాత స్నేహాన్ని కొనసాగించడం కష్టం అయ్యేలా ఉందేమో. ఇప్పుడు తెలంగాణాకి పాకుతున్న కుల రాజకీయాల నేపథ్యంలో ఈ యంగ్ టర్క్స్ లో ఒక్కరైన వేం నరేందర్ రెడ్డి ఏ స్టెప్ తీసుకుంటారు అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రేవంత్ తో పాటు మరికొందరు టీడీపీ నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవచ్చు అన్న అంచనాలు నెలకొంటున్న తరుణంలో వేం రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందో ?