సమీక్ష : “మనమే”–డీసెంట్ గా సాగె ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా!

Review : “Maname” – Decent Saga Family Emotional Drama!
Review : “Maname” – Decent Saga Family Emotional Drama!

విడుదల తేదీ : జూన్ 07, 2024

తెలుగు బుల్లెట్ రేటింగ్ : 3/5

నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి, మాస్టర్ విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి సుదర్శన్ తదితరులు

దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య

నిర్మాతలు : టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల

సంగీత దర్శకుడు: హేశం అబ్దుల్ వహాబ్

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

చార్మింగ్ స్టార్ శ‌ర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా ‘మ‌న‌మే’. ఈ మూవీ ను శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కించాడు. కాగా ఈ మూవీ ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులని ఈ మూవీ ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం !

కథ:

విక్రమ్ (శర్వానంద్) సరదాగా తిరుగుతూ తాగుతూ అమ్మాయిలతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఐతే, విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్ అతని భార్య ఒక ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతారు . ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్ సుభద్ర (కృతి శెట్టి) ఆ పిల్లాడికి నాలుగు నెలల పాటు కేర్ టేకర్స్ గా ఉండాల్సి వస్తుంది . ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతారు . కానీ, అప్పటికే సుభద్రకు మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేస్తాడు ?, తన ప్రేమని గెలిపించుకున్నాడా? లేదా ?, చివరకి సుభద్ర – విక్రమ్ ఒక్కటయ్యారా ? లేదా ? అనేది మాత్రం మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

డీసెంట్ కాన్సెప్ట్ తో పాటు గా ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్ గా సాగే లవ్ ఎమోషన్స్.. ఈ మనమే మూవీ కి హైలైట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా శర్వా- కృతి ల మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమ్ ఆదిత్య పాత్ర ట్రాక్.. ఆ పాత్ర ద్వారా హీరోహీరోయిన్లను కలపడం వంటి అంశాలు చాలా బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనని కనబరిచాడు. సెకండ్ హాఫ్ లో ఒక సగటు తండ్రిగా చాలా బాగా నటించారు .

ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకు శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా క్లైమాక్స్ సీక్వెన్స్ లో శర్వానంద్ నటన మూవీ కే హైలెట్ గా నిలుస్తుంది . అలాగే శర్వానంద్ కి – కృతి శెట్టి కు మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయకగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో మాత్రం చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆమె అందరిని ఆకట్టుకుంది.

Review : “Maname” – Decent Saga Family Emotional Drama!
Review : “Maname” – Decent Saga Family Emotional Drama!

అతిధి పాత్రల లో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్ గా అయేషా ఖాన్ తన గ్లామర్ తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్ తో మెప్పించారు . అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ నాచ్యురల్ నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ కూడా . కథనం మాత్రం కొన్ని చోట్ల చాలా సింపుల్ గా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని ఫ్యామిలీ సీక్వెన్సెస్ అలాగే కొన్ని లవ్ సీక్వెన్సెస్ మాత్రాఎం ఆసక్తికరంగా సాగలేదు. ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్రామా లు కూడా రెగ్యులర్ గానే సాగింది. మొత్తానికి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తాను అనుకున్న కంటెంట్ ని స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. మూవీ లో కొన్ని రొటీన్ సీన్స్ ని ట్రిమ్ చేసి వుంటే మూవీ కి ఇంకా ప్లస్ అయ్యేది.

అలాగే, శ్రీరామ్ ఆదిత్య స్క్రీన్ ప్లే విషయంలో కూడా బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఇంటర్వెల్ లో ఒక చిన్న కాన్ ఫ్లిక్ట్ ఇచ్చి… సెకండాఫ్ పై కొంత ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేసినా కూడా . అది అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ప్రతీ సీన్ ని పొడగించడం వల్ల కొన్ని సీన్స్ లు బోర్ కొట్టాయి. ఇక క్లైమాక్స్‌ కూడా అందరూ ఊహించిన విధంగానే ఉన్నది .

సాంకేతిక విభాగం:

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నారు . అలాగే, ఆయన టేకింగ్ కూడా చాలా బాగుంది. కానీ, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మాత్రం ఆయన తడబడ్డారు. సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగున్నది . ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, మూవీ కి ప్లస్ అయ్యేది. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ బాగుంది. టిజి విశ్వప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

తీర్పు: 

‘ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా’గా వచ్చిన ఈ మనమే మూవీ ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. గుడ్ కాన్సెప్ట్ తో పాటు డీసెంట్ గా సాగే పేరెంట్స్ ఎమోషన్స్ మరియు లవ్ సీన్స్ అండ్ క్లైమాక్స్ ఈ మూవీ లో హైలైట్స్ గా నిలిచాయి. ఐతే, ఈ మూవీ లో కొన్ని సీక్వెన్సెస్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ మూవీ కి మైనస్ అయ్యాయి. కాకపోతే, శర్వానంద్ – కృతి శెట్టి తమ నటనతో మూవీ ని మరో లెవల్ కు తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ ‘మనమే’ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను చాలా బాగా మెప్పిస్తోంది.