విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2024
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి తదితరులు.
దర్శకుడు: వై. యుగంధర్
నిర్మాత: మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి
సంగీత దర్శకుడు: సాహిత్య సాగర్
సినిమాటోగ్రఫీ: జెమిన్ జోమ్ అయ్యనేత్
ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు
సత్యం రాజేష్ కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ “టెనెంట్”. వై.యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. కాగా ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
గౌతమ్ (సత్యం రాజేష్) సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు . తన మరదలు సంధ్య (మేఘా చౌదరి)తో పెళ్లి కూడా అవుతుంది. ఇద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. మరోవైపు రిషి (భరత్ కాంత్) పక్క ప్లాట్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఉంటాడు. ఐతే, రిషి, ఎప్పటి నుంచో శ్రావణి (చందన పయ్యావుల)తో ప్రేమలో పడతారు . ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సంధ్య మాత్రం చనిపోతుంది. అసలు సంధ్యని గౌతమ్ ఎందుకు చంపాడు ?, రిషి – శ్రావణి ఎందుకు బిల్డింగ్ పై నుంచి దూకారు ?, అసలేం జరిగింది ?, ఈ రెండు జంటల జీవితాలు ఎలా నాశనం అయ్యాయి ?, ఇంతకీ, గౌతమ్ మంచోడా ? చెడ్డోడా ? అనేది మాత్రం మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
నిజంగానే ఈ ‘టెనెంట్’ ప్రధాన కథాంశం మన చుట్టూ జరిగే సంఘటనలకు దగ్గరగా ఉంటుంది. రియల్ పాయింట్ చుట్టూ సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీని దర్శకుడు వై. యుగంధర్ బాగానే ఎస్టాబ్లిష్ చేశారు . ముఖ్యంగా ఆడవాళ్లు ఈ మోడ్రన్ కల్చర్ లో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పిన మూవీ ఇది. మూవీ లో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది.
సత్యం రాజేష్, మేఘా చౌదరి తమ పాత్రలకి న్యాయం చేశారు. ఎమోషనల్ అండ్ సీరియస్ సన్నివేశాల్లోని సత్యం రాజేష్ నటన మూవీ కే హైలైట్ గా నిలిచింది. మరో కీలక పాత్రలో నటించిన భరత్ కాంత్ చాలా బాగా నటించారు . అతని లుక్స్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. మరో హీరోయిన్ గా చందన పయ్యావుల నటన చాలా బాగుంది. ఇక తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, అనురాగ్, రమ్య పొందూరి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎస్తేర్ నొరోన్హ సీరియస్ పోలీస్ అధికారిణిగా ఆకట్టుకున్నారు. దర్శకుడు ఒక హత్య చుట్టూ అనేక కోణాల్లో మూవీ ని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ టెనెంట్ మూవీ లో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతోంది . అలాగే, గుడ్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ కూడా రెగ్యులర్ గానే ఉన్నది . అలాగే, ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ని ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా మూవీ ఈ స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో ఉంటుంది .
మొత్తానికి ఈ టెనెంట్ సినిమా మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ని స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని సీన్స్ విషయంలో బాగాలేదు. అలాగే సెకండాఫ్ లో కూడా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోవు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు వై. యుగంధర్ మంచి క్రైమ్ థ్రిల్లర్స్ కు గుడ్ ట్రీట్మెంట్ ని యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉంటె బాగుండేది . మూవీ లో జెమిన్ జోమ్ అయ్యనేత్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమా’ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలని కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. సాహిత్య సాగర్ సంగీతం కూడా చాలా బాగుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ కూడా బాగా ఆకట్టుకుంది. మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
తీర్పు :
‘టెనెంట్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ డ్రామా.. కొన్ని చోట్ల థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పర్వాలేదు . అయితే, స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం వంటి అంశాలు మూవీ కి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులని పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. కానీ, ఈ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ సినిమా లో కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా కనెక్ట్ అవుతాయి.