Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ‘కడప’ అంటూ ఒక వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే. కడప వెబ్ సిరీస్ ఎంతటి దుమారంను రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అంటూ ఒక పోర్ట్ షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించాడు. ఆడవారు శృంగారంలో పడుతున్న ఇబ్బందులను వెలుగెత్తి చూపేందుకు తాను ఈ షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించినట్లుగా వర్మ చెబుతున్నాడు. అయితే వర్మ స్థాయి వ్యక్తి ఇలాంటి ఫిల్మ్‌లు తీయడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అది కూడా రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయాలని భావించడం మరీ నీచం అంటూ విమర్శలు చేస్తున్నారు.
వర్మ ఆ షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేయడం వల్ల ఇండియాలో పోర్న్ చూసే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని, ఇప్పటికే ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న ఇండియా వర్మ చేస్తున్న పనితో మరింత ముందుకు వెళ్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్మ చేస్తున్న ఈ పోర్న్ చిత్రం ఇండియన్ యువతను చెడగొట్టే విధంగా ఉందని, వర్మ చేస్తున్నది ఆడవారికి మంచి చేయక పోగా చెడు చేస్తుందని డాక్టర్ సమరం వంటి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరేం అన్నా కూడా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా తాను మాత్రం చేసేది చేస్తాను, విడుదల చేయాలనుకున్నది అనుకున్న సమయంలోనే చేస్తాను అంటూ వర్మ చెబుతున్నాడు. ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న వర్మ ఇలాంటి పోర్న్‌ను తీయడం ఏ ఒక్కరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ చిత్రం విడుదల కాకుండా ఆపే శక్తి ఎవరికి లేదా అంటూ సినీ జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.