Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుని, ఆ విషయాన్ని రచ్చ రచ్చ చేసే వర్మ మరోసారి శ్రీరెడ్డి విషయంలో జోక్యం చేసుకుని కంపు లేపాడు. పవన్ కళ్యాణ్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించిన శ్రీరెడ్డి వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడని తేలిపోయింది. ఆ విషయం స్వయంగా తానే ఒప్పుకున్నాడు. వివాదాల దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మకు ఏ విషయంలో అయినా పబ్లిసిటీ తెచ్చుకోగల సమర్ధుడు. తన ఆలోచనతో శ్రీరెడ్డికి పవన్‌ను మాదర్చూద్ అంటూ తిట్టు అంటూ సలహా ఇచ్చాడు. శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమం తనకు నచ్చిందని, అందుకే ఆమె ఉద్యమం మరింతగా ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో తాను ఇలా చేశాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.
శ్రీరెడ్డి అమ్మాయిల కోసం చేస్తున్న ఉద్యమం నన్ను ఎంతగానో ప్రేరేపించిందని, ఆ ఉద్యమం ముందుకు సాగాలంటే, అందరి దృష్టి ఆమె వైపుకు మరలాలి అంటే పవన్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయాలి, తిట్టాలి అంటూ తాను స్వయంగా సలహా ఇచ్చాను కనుక ఆమె తప్పేం లేదని, ఆమెను ఈ వివాదంలోకి లాగాల్సిన అవసరం లేదని, తాను పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెబుతున్నాను అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. సహజంగా అయితే రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు రాడు. కాని శ్రీరెడ్డి ఉద్యమం ముందుకు సాగాలనే మంచి ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీరెడ్డి ఉద్యం పవన్‌కు వర్మ క్షమాపణలు చెప్పడం వల్ల ముందుకు వెళ్తుందని సినీ వర్గాల వారు కూడా భావిస్తున్నారు. మొత్తానికి చేసిన తప్పును ఒప్పుకున్నందుకు వర్మపై మరింతగా గౌరవం, అభిమానం పెరిగిందని ఆయన అభిమానులు అంటున్నారు.