Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమాజపు వైఖరికి భిన్నంగా లోకమంతా ఒకవైపు , నేను ఒక్కడిని ఒకవైపు అన్న రీతిలో వ్యవహరించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి మరణంతో షాక్ కి గురి అయ్యారు. దేవుడు లేడు అని ఘంటాపధంగా చెప్పే రాము శ్రీదేవి మరణవార్త విన్నాక “ ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా దేవుడిని ద్వేషిస్తున్నట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నా జీవితంలో అతి పెద్ద వెలుగుని తీసుకుపోయాడని దేవుడిని నిందించిన రాము బోనీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శ్రీదేవికి రాము ఎంత గొప్ప ఫ్యాన్ అన్నది తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చేసిన ఓ టీవీ షో లో ఆమె నటనకు పొంగిపోయి పాదాభివందనం చేయడానికి రెడీ అయిపోయాడు రాము. ఓ సినిమా కథ వినిపించడానికి ఆమె ఇంటికి కెళ్లిన రాము అక్కడ ఆమె ఓ సామాన్య గృహిణిలా కాఫీ తీసుకురావడం చూసి బోనీ మీద కోపం కూడా తెచ్చుకున్నాడు. శ్రీదేవిని అంతగా ఆరాధించే రాము మున్ముందు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడో ఏమో !