Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయించిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు రాజకీయంగా మరియు సినీ రంగంలో కూడా పెను సంచలనం సృష్టించాయి. ఆ వ్యాఖ్యల వెనుక తాను ఉన్నాను అని, శ్రీరెడ్డికి ఎలాంటి పాపం తెలియదు అంటూ దర్శకుడు వర్మ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో వివాదం పెద్దది అయ్యింది. అంతకు ముందు వరకు శ్రీరెడ్డి అంటే పలువురు జాలి చూపించి, ఆమెకు మద్దతుగా నిలిచారు. కాని తాజాగా సంఘటన తర్వాత శ్రీరెడ్డి ఏకాకి అయ్యింది. ఆమె చేపట్టిన ఉద్యమం పక్కదారి పట్టింది. మొత్తానికి శ్రీరెడ్డి కెరీర్ రెంటికి చెడ్డ రేవడి తరహాలో తయారు అయ్యింది.
ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డికి తాను ఛాన్స్ ఇస్తాను అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. శ్రీరెడ్డితో ఒక సినిమాను చేస్తాను అని, ఆమె లీడ్‌గా తాను ఒక స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఒక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని వర్మ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఆ మద్య పవన్‌పై విమర్శలు వర్మ చేయమన్నాడు అని, వర్మ తనను తీవ్రంగా మోసం చేశాడు అంటూ శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించేందుకు ముందుకు వస్తుందా అనేది చూడాలి. తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీరెడ్డి సినిమా ప్రస్తుతం ఆడే పరిస్థితి లేదు. అందుకే వర్మ ఈ సినిమాను హిందీలో తెరకెక్కించి తెలుగులో డబ్ చేసి సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని భావిస్తున్నాడు. మరి వర్మ ఈ శ్రీరెడ్డి మూవీ ఎంత మేరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.