Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రవితేజ ‘మిరపకాయ్’, ప్రభాస్ ‘మిర్చి’ చిత్రాలతో పాటు ఇంకా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రిగా గంగోపాద్యాయ. ఈ అమ్మడు ఫారిన్లో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం రావడంతో సినిమాలను వదిలేసి వెళ్లిన విషయం తెల్సిందే. డిగ్రీ అందుకున్న తర్వాత మళ్లీ ఈమె హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. ఇటీవలే అమెరికా ప్రముఖ యూనివర్శిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఈమె ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు ఇండియాలో ఉంటారు. వారికి పెళ్లి విషయమై ఈమె చెప్పలేదని, గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న అతడిని రిచా ఇటీవలే ఒక చర్చ్‌లో వివాహం చేసుకుంది. వీరిద్దరు కొంత కాలంగా సహజీవనం సాగిస్తున్నారని, పెళ్లి విషయంలో రిచా కుటుంబ సభ్యులు మొదటి నుండే అభ్యంతరం చెప్పడంతో తాజాగా కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకుంది. ఈ విషయం రిచా సన్నిహితుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా మాత్రం తన కుటుంబ సభ్యులు ఎప్పుడైనా తన వద్దకు వస్తారని, వారు తన ప్రేమను అర్థం చేసుకుంటారు అంటూ నమ్మకంను వ్యక్తం చేస్తోందట. మొత్తానికి రిచా రహస్య వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.