Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు కాలు జారితే తీసుకోవచ్చు కానే నోరు జారితే వెనక్కి తీసుకోలేము అని ఒక సామ్తే ఉండేది ఇక భవిష్యత్తులో పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యామా అంటూ కొత్త సామెతలు పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఒకామె ఇలాగే ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ జారి (ఒక పోస్ట్ చేసి) ఇల్లును గుల్ల చేసుకుంది. అర్ధం కాలేదు కదూ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఆర్ టీ నగర్ పరిధిలో నివాసముండే ప్రేమ అనే యువతి, గత శనివారం ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెడుతూ, తాను ఊరికి వెళుతున్నట్టు పేర్కొంది. ఆ పోస్టుకు ఎన్ని లైక్ లు వచ్చాయో తెలియదుగానీ, విషయం తెలుసుకున్న దొంగలు మాత్రం తమ చేతికి పని చెప్పారు.
ఇంటి తాళాలను బద్దలు కొట్టి ప్రవేశించిన దొంగలు, బీరువాను పగులగొట్టి, అందులోని రూ. 5 లక్షల విలువైన నగలను, 57,000 నగదును దోచుకెళ్లారు. నిన్న ఉదయం ఊరి నుంచి తిరిగి వచ్చిన ప్రేమ, ఇంట్లో దొంగతనం గురించి తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఫేస్బుక్ స్టేటస్ చూసిన వ్యక్తులే దొంగతనానికి పాల్పడ్డట్టు పోలీసులు విచారణలో తేలింది. అనుక్షణం ఫేస్ బుక్ తో గడుపుతూ, ప్రతి క్షణాన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే అలవాటు ఎంతో మందికి ఉంటుంది. ఒక్కోసారి పెట్టే పోస్టు ఎంతటి అనర్థానికి దారితీస్తుందో చెప్పకనే చెప్పే ఘటన ఇది. ఇకనుండైనా షాపింగ్‌కు వెళుతున్నానని, సినిమాకు వెళుతున్నానని, ఇప్పుడే అన్నం తింటున్నానని.. ఇలా ప్రతీ ఒక్కటీ ఫేస్బుక్లో అప్డేట్ చేయకుండా ఉంటె మంచిదని స్టేటస్ అప్డేట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.