నేనో బచ్చా.. ఛాన్స్‌ లేనే లేదు

Vijay Devarakonda Says I Am Affitral Compare To Tollywood Stars

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమా వారికి ఒప్పుడు నంది అవార్డులు చాలా ప్రాముఖ్యంగా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఇచ్చే నంది అవార్డులు వచ్చాయి అంటే చాలా గొప్ప. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. రాజకీయాల్లో ఉన్న వారికి, అధికార పార్టీలో ఉన్న వారికి నంది అవార్డులు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆ కారణంగా నంది అవార్డు రాకపోవడమే మంచిదనే అభిప్రాయం ప్రస్తుత హీరోల్లో ఉంది. ఈ సమయంలో సినీ తారలు ఎక్కువ ఫిల్మ్‌ ఫెయిర్‌ అవార్డులపై దృష్టి పెడుతున్నారు. ఎన్నో అవార్డు వేడుకలు జరుగుతాయి, కాని ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుకు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యతను స్టార్స్‌ ఇస్తారు. ప్రస్తుతం సినీ ప్రముఖులు అంతా కూడా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల్లో తమ పేరు ఉండాని కోరుకుంటున్నారు. త్వరలో నిర్వహించబోతున్న ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు 2017 కు గాను నామినేషన్‌ను విడుదల చేయడం జరిగింది.

గత సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ఉత్తమ హీరో అవార్డుకు గాను చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండలు నామినేట్‌ అయ్యారు. స్టార్‌ హీరోల సరసన విజయ్‌ దేవరకొండ నామినేట్‌ అవ్వడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది. అర్జున్‌ రెడ్డి చిత్రంలో అద్బుతమైన నటనకు గాను విజయ్‌ దేవరకొండుకు ఈ నామినేషన్‌ దక్కింది. ఈ విషయమై విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ లెజెండ్స్‌ సరసన తాను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే సమయంలో కాస్త నర్వస్‌గా కూడా ఉంది. వారి ముందు నేనో బచ్చాను అనే విషయం తెలిసినా కూడా నామినేషన్‌లో నా పేరు ఉన్నందుకు సర్‌ప్రైజ్‌ అయ్యాను. అయితే ఫైనల్‌ లిస్ట్‌లో ఉంటానన్న నమ్మకం నాకు లేదు అంటూ విజయ్‌ తేల్చి చెప్పాడు. ఫిల్మ్‌ ఫెయిర్‌ అవార్డు వేడుకకు వెళ్తాను అని, అయితే తనతో పాటు ఒక అభిమానిని కూడా తాను తీసుకు వెళ్లాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అర్జున్‌ రెడ్డికి ఇప్పటికే పలు అవార్డులు రివార్డులు, రికార్డులు దక్కాయి. తాజాగా ఈసారి మరో రికార్డు ఈయనకు దక్కుతుందో లేదో చూడాలి. ఈ చిత్రంతో విజయ్‌ ఉత్తమ హీరోగా ఫిల్మ్‌ఫేర్‌ అందుకుంటే సంచలనం అని చెప్పుకోవచ్చు.