2.ఓ చిత్రాన్ని త్రిడీ లో చుడండి… రజినీకాంత్…!

Shocking Price For Robo 2.0 Movie Ticket

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 2.ఓ. ఈ చిత్రం ఈ నెల 28 న ప్రపంచ వ్యాప్తం గా విడుదల కానున్నది. ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మొదటిసారిగా ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. అమిజాక్సన్ మరో హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. ఇటివల విడుదలైన 2.ఓ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన 2.ఓ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రజినీకాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో టెక్నాలజీ, త్రీడీ, కథల కాంబినేషన్ అద్భుతంగా ఉందని, అందుకే తప్పకుండ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉన్నది అన్నారు.

Piracy Website Tamil Rockers Warns To Leak Rajinikanth 2.0 Movie Soon

2.ఓ చిత్రాన్ని గ్రాఫిక్స్ పరంగా శంకర్ అద్బుతంగా తెరకెక్కించాడు, ఇందులో 45 పెర్సెంట్ గ్రాఫిక్స్ ఉంటుంది. ఈ చిత్రం కోసం నేను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాను అన్నారు. రోబోకి సీక్వెల్ గా వస్తుండటంతో 2.ఓ కి అసలు ప్రమోషన్ కూడా అవసరం లేదు అని, ప్రతి ప్రేక్షకుడి లగే ఈ సినిమా కోసం నేను కూడా ఆత్రుతాభావంతో ఉన్నాను అన్నారు. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని త్రీడీ లో చూస్తే చాలా థ్రిల్ గా ఫీల్ అవుతారు అని అది ఏదో గ్రాపిక్ మాయ ప్రపంచం లో ఉన్నట్టుగా ఉంటుంది అన్నారు. లైక ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం లో 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది.

robo-2.0