ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు ఎంతో మంది వైద్యులు కూడా బలౌతున్నారు. కరోనా వైరస్ నివారణకు డాక్టర్లు, నర్సులు అమితమైన కృషి చేస్తూ వారి ప్రాణాలను సైతం పలంగా పెడూతున్నారు. కరోనాను తగ్గించే దశలో ఎందరో డాక్టర్లు కూడా బలైపోయారు. అయితే కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు అక్కడ చేరిన రోగులకు ఆహారం, మందులను పంపిణీ చేయడంలో ఇది సహాయపడుతుందా? అని చూడటానికి ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో రోబోను పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
హ్యూమనాయిడ్ రోబోట్ ఆహారం, ఔషధాలను తీసుకువెళ్ళే ట్రేతో కేటాయించిన రోగులకు అందిస్తొంది. దీని కారణంగా ఎక్కువ మోస్తారులో ఆసుపత్రి సిబ్బందికి కరోనా బారిన పడే అవకాశాలు తగ్గనున్నట్లు సిబ్బంది వెల్లడించారు.అయితే కరోనా పరిస్థితిని దాని విజృంభనను చూస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ తమను సంప్రదించి, రోగులకు ఆహారం, మందులను తీసుకెళ్లగల రోబోను అందిస్తోంది. ఇది సాధారణంగా నర్సింగ్ సిబ్బంది చేసే పనిని కూడా చేయగలదని తెలిపినట్లు ఎస్ఎంఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ మీనా తెలిపారు. ఇది లిఫ్ట్‌ను ఉపయోగించుకొని.. ఒక ఎంచుకున్న వార్డులో అది అనుకున్న వార్డుకు చేరుకుంటుందని.. ఆ తర్వాత అది ఛార్జింగ్ పాయింట్ వద్దకు వెళ్తుందని తయారీదారులు పేర్కొన్నారు. కళ్ళకు కనిపించే దేవుళ్ళైన డాక్టర్ల కోసం ఒక ప్రైవేట్ సంస్థ చేస్తున్న ప్రయత్నానికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు