శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికగా ఆగస్ట్ 30వ తేదీ నుండి ఆసియా కప్ 2023 జరగనుంది. ఇప్పటికే రెండు దేశాలలో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే ఈ ఆసియా కప్ లో పాల్గొనే ఇండియా జట్టును సైతం ఈ మధ్యనే అజిత్ అగార్కర్ సారధ్యంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇక శ్రీలంకకు ఇండియా జట్టు ఆగష్టు 30వ తేదీన బయలుదేరి వెళ్లనుంది. అందులో భాగంగా ఆలూర్ లోని శిక్షణా శిబిరంలో ఇండియా జట్టులోని 17 మంది ప్లేయర్లు ఉన్నారు.
కాగా ఇప్పటి వరకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యాలు యోయో టెస్ట్ లో పాస్ అయ్యారు. ఇక యోయో టెస్ట్ లో జట్టులో ఉన్న మిగిలిన ప్లేయర్ లు కూడా పాల్గొనగా ఇంకా రిజల్ట్స్ తెలియాల్సి ఉంది. ఇక ఆసియా కప్ లో ఇండియా తన మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడనుంది.ఇక దాయాదుల పోరు ఎంత హోరాహోరీగా ఉంటుందన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాగా జట్టులోకి కే ఎల్ రాహుల్ మరియు శ్రేయాస్ అయ్యర్ లు జట్టులోకి చాలా కాలం తర్వాత తీసుకుంటున్నందున ఏ విధంగా ఆడుతారు అన్నది తెలియాల్సి ఉంది.