దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ తన బ్యాటింగ్‌లో అరుదైన ఘనత సాదించాడు. ఈ టీమిండియా ఓపెనర్ ఇప్పటి వరకూ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ 500కు పైగా పరుగులు తీసి ఓపెనర్‌గా పనికి రావన్న విమర్శలని తిప్పి కొట్టాడు. ఒక టెస్టు సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన ఐదో భారత్ ఓపెనర్‌గా అరుదైన ఘనతను పొందాడు.
ఇంతకు ముందు ఐదు వందలపైగా సాధించిన భారత ఓపెనర్ల లిస్ట్ లో వినోద్ మన్కడ్, బుద్ధి కుందిరేన్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఉన్నారు. ఈ నలుగురి ఆటగాళ్లతో పాటు ఐదు వందలకు పైగా పరుగులు సాధించ లిస్ట్ లో చేరి ఐదో భారత్ ఓపెనర్‌గా స్థానం సంపాదించాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు లోనే 303 పరుగులు, రెండో టెస్టులో 14 పరుగులు, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 180 పైగా పరుగులు సాధించి ఈ ఘనత పొందాడు.