రౌడీ షీటర్ దారుణ హత్య

రౌడీ షీటర్ దారుణ హత్య

ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలో రౌడీ షీటర్ అశోక్ దారుణ హత్యకు గురయ్యాడు. కుమారుడి ఆగడాలను భరించలేక తండ్రే హతమార్చాడు. గ్రామంలో అరాచకాలకు పాల్పడుతున్న అశోక్.. మద్యం మత్తులో నిత్యం తండ్రితో గొడవ పడేవాడు.

తీరు మార్చుకోమని చెప్పిన తండ్రిపై నిన్న రాత్రి దాడి చేయడంతో.. విసిగిపోయిన తండ్రి పెంచలయ్య.. మమకారాన్ని చంపుకొని కర్రతో కసిగా తలపై కొట్టి.. కుమారుడిని హతమార్చాడు. హత్యకు ఉపయోగించిన కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.