Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Rs 200 Notes May Only Be Available At Banks Not ATMs
నోట్ల రద్దు తర్వాత కేవలం 2వేల నోటే విడుదల చేసి.. జనానికి నరకం చూపించిన ఆర్బీఐ… తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాక మెల్లగా 500 నోటు వదిలింది. కానీ ఇప్పటికీ మార్కెట్లో 2వేల నోట్లే ఎక్కువున్నాయనేది బహిరంగ రహస్యం. జనం చిల్లర కష్టాలు తీరకపోవడంతో… ఆర్బీఐ కొత్త రూటు వెతికింది.
వంద, ఐదు వందల నోట్లకు మధ్యలో రెండు వందల నోటు విడుదల చేయాలని నిర్ణయించిన ఆర్బీఐ.. ఇప్పటికే ప్రింటింగ్ పూర్తిచేసింది. ఇక త్వరలోనే 200 నోట్లు మార్కెట్లోకి వస్తాయని జనం సంతోషిస్తున్నారు. కానీ సామాన్యులకు దిమ్మతిరిగే షాకిచ్చింది ఆర్బీఐ.
200 నోట్లు ఏటీఎంలో ఉంచడం లేదని బాంబు పేల్చింది. ఏటీఎంలో ఇప్పుడున్నట్లుగానే 2వేలు, 500 నోట్లే ఉంటాయని, 200 నోట్లు బ్యాంకుల దగ్గరే ఇస్తారని స్పష్టం చేసింది. ఆర్బీఐ ప్రకటనలోనే బ్యాంకుల దగ్గర మాత్రమే అని చెప్పిందంటే.. ఇక బ్యాంకు సిబ్బంది బాగోతం గురించి జనానికి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు.
మరిన్ని వార్తలు: