ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో బ్యాంక్ ఉద్యోగి పనిచేసే బ్యాంక్ కే కన్నం వేశాడు. భవిష్యత్ అవసరాల కోసం ప్రజలు బ్యాంకులో దాచుకున్న సొమ్మును క్యాషియర్ గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశాడు. తాజాగా జిల్లాలోని నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)లో క్యాషియర్‌గా పనిచేస్తున్న గుండ్ర రవితేజ బ్యాంకులో కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఏకంగా రూ.1.56 కోట్లు తన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.