Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా ఒక భారీ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌లు ఈ చిత్రంలో చాలా విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా సమంతను ఎంపిక చేయడం జరిగిందని, త్వరలోనే ఎన్టీఆర్‌కు జోడీగా ఒక స్టార్ హీరోయిన్ను ఎంపిక చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. సమంత మరోసారి చరణ్‌కు జోడీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అయితే అవి పుకార్లే అని తేలిపోయింది.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం ఇంకా హీరోయిన్ను ఫైనల్ చేయలేదని, ప్రస్తుతం రాజమౌళి మదిలో అయిదుగురు హీరోయిన్స్ ఉన్నారని, వారిలోంచి ఇద్దరు హీరోయిన్స్‌ను ఫైనల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్లకు సరి జోడీ హీరోయిన్స్‌ను రాజమౌళి ఎంపిక చేయడం ఖాయం. రాజమౌళి సినిమాలు అంటే హీరోయిన్స్‌కు సమాన ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఆ చిత్రంలో నటించేందుకు హీరోయిన్స్ ఎగబడుతున్నారు. సమంతకు ముందు రాశిఖన్నాను జక్కన్న ఎంపిక చేశాడు అంటూ వార్తలు వచ్చాయి. అవి కూడా పుకార్లే అని తేలిపోయింది. 2019 చివర్లో సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.