ముందు నువ్వు మారు ఉప్పీ..?

rumours-about-real-star-upendra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పొలిటికల్ ఎంట్రీ ఇస్తానన్న కన్నడ స్టార్ ఉపేంద్రపై విమర్శలు మొదలైపోయాయి. సినిమాల్ని విచిత్రంగా తీసే ఉపేంద్ర సందేశం పేరుతో కామెడీ వేషాలు వేస్తారని అందరికీ తెలిసిందే. ఇప్పుడో సామాజిక కార్యకర్త కూడా వారికి తోడయ్యారు. అయితే ఆయన ఉపేంద్ర సినిమాల గురించి కాకుండా.. ఆయన వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టాడు.

జనాన్ని ఉద్ధరిస్తానని పెద్ద కబుర్లు చెపుతున్న ఉపేంద్ర.. ముందు తన వ్యవసాయ భూముల్లో వాణిజ్య కార్యకలాపాలు ఆపేయాలని ఆయన డిమాండ్ చేశాడు. చుట్టూ పొలాల మధ్య భూమి తీసుకుని.. అందరికీ నష్టం కలిగించేలా వాణిజ్య కార్యకలాపాలు చేయడం సరైన పద్ధతా అని ప్రశ్నించారు. కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినంత మాత్రాన ఉపేంద్ర పుణ్యాత్ముడైపోడని ఆయన చెబుతున్నారు.
ఉపేంద్ర పొలిటికల్ ఎంట్రీ స్టేట్ మెంట్ కే ఇంతగా స్పందిస్తున్న ఆర్టీఐ కార్యకర్త హీరేమఠ్.. ఇక ముందు ముందు రెచ్చిపోతారని అందరూ అనుకుంటున్నారు. దీంతో ఉపేంద్ర వ్యతిరేక వర్గం కూడా ఆయనకు మరిన్ని ఆధారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపేంద్ర లాంటి వ్యక్తి పాలిటిక్స్ లోకి వస్తే రాజకీయాల్లో విలువలు మరింత దిగజారుతాయని ప్రచారం చేయడానికి కూడా యాంటీ ఉపేంద్ర గ్రూప్ వెనుకాడటం లేదు. సో ఉప్పీ జర భద్రం.

మరిన్ని వార్తలు:

జనసేనాని ఓవరాక్షన్ ఎక్కువైంది

అభివృద్ధి, సంక్షేమం రెండు చ‌క్రాలు

న‌వ్యాంధ్ర‌ను నంబ‌ర్‌ వ‌న్ చేద్దాం