కిమ్ దూకుడుకు తగ్గిన ట్రంప్

america-is-ready-for-a-war-in-north-korea

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏమీలేని వాడు అందరి కంటే ధైర్యవంతుడు. ఎందుకంటే అతడికి ప్రమాదం జరిగినా ఏమీ కోల్పోడు కాబట్టి. కానీ అన్నీ సమకూర్చుకున్నవాడు అలా కాదు. ఎంత శక్తివంతుడైనా తన సంపాదన వేస్టైపోతుందనే భయం అతడికి ఉంటుంది. ఇప్పుడు కొరియా, అమెరికాల పరిస్థితి సేమ్ ఇలాగే ఉంది. కిమ్ ఏమీ లేనివాడైతే.. ట్రంప్ అన్నీ సమకూర్చున్నవాడు .

అమెరికన్ ప్రజలు యుద్ధానికి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్లు పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికే ఓటేస్తారు. యుద్ధం జరిగితే సాధించిన అభివృద్ధి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని వాళ్లకు తెలుసు. అయినా సరే ప్రపంచంలో అమెరికా అధ్యక్షులే ఎక్కువ యుద్ధాలు చేశారు. ఇదే విధి వైపరీత్యం. ఇప్పుడు కొరియాతో కూడా యుద్ధానికి కాలుదువ్వారు ట్రంప్.

కానీ బలహీనుల్ని భయపెట్టే అమెరికా.. మొండోడైన కిమ్ దూకుడుకు నివ్వెరపోయింది. ఏకంగా క్షిపణి ప్రయోగాలతో పాటు వార్ రూమ్ భేటీలతో కలకలం రేపుతున్న కిమ్ ఇప్పుడు ఏకంగా ఆ ఫోటోలు కూడా మీడియాకు రిలీజ్ చేశాడు. అమెరికా ఊహించినదానికంటే ఎక్కువ శక్తి తమ క్షిపణులకు ఉందని కుండబద్దలు కొట్టాడు. దీంతో ట్రంప్ కాస్త వెనక్కితగ్గారు. అమెరికా స్పందనను బట్టే తమ వైఖరి ఉంటుందని తేల్చిచెప్పాడు కిమ్.

మరిన్ని వార్తలు:

ముందు నువ్వు మారు ఉప్పీ..?

జనసేనాని ఓవరాక్షన్ ఎక్కువైంది

అభివృద్ధి, సంక్షేమం రెండు చ‌క్రాలు