రంగస్థలంలో… సమంత పుకార్లు కూడా నిజమేనా?

rumours-on-Samantha-Role-in

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. సినిమా ఆరంభం నుండి కూడా ఈ చిత్రంలో చరణ్‌ చెవిటి వాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా టీజర్‌లో చరణ్‌ స్వయంగా తాను సౌండ్‌ ఇంజనీర్‌ అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఒక స్టార్‌ హీరో ఇలా చెవిటివాడుగా కనిపించనున్న నేపథ్యంలో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

మొదటి నుండి కూడా రామ్‌ చరణ్‌ చెవిటి వాడని, సమంత మూగ అమ్మాయి అంటూ వార్తలు వచ్చాయి. చరణ్‌ చెవిటి వాడు అంటూ వార్తలపై క్లారిటీ వచ్చింది. ఇక సమంత విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. సమంత లుక్‌ ఇప్పటికే రివీల్‌ అయ్యింది. పాత తరం పల్లెటూరు అమ్మాయిగా లంగా ఓణీలో సమంత కనిపించబోతుంది. చాలా అమాయకమైన పాత్రలో సమంత కనిపించబోతున్నట్లుగా లీక్‌ అయిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. సమంత మూగ అమ్మాయిగా కనిపిస్తే సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. హీరో చెవిటి వాడు కాగా, హీరోయిన్‌ మూగ అవ్వడం టాలీవుడ్‌లో గతంలో ఎప్పుడు జరగలేదు. చరణ్‌ విషయంలో పుకార్లు నిజమైనట్లుగా సమంత విషయంలో కూడా పుకార్లు నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.