Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశాఖ రాజకీయాలు కొత్త మలుపు తిరగబోతున్నాయి. ఇన్నాళ్లు అధికార టీడీపీ లో గంటా, అయ్యన్న వర్గాల మధ్య పోరు సాగింది. 2019 నాటికి సీన్ మారిపోతోంది. అయ్యన్న రిటైర్ అయ్యి కొడుకు విజయ్ ని ఎన్నికల బరిలోకి దింపడానికి రెడీ అయిపోయారు. ఇక గంటా వచ్చే ఎన్నికలకు జిల్లా నుంచే మారిపోయే ఆలోచన చేస్తున్నారు. విశాఖ సరిహద్దుల్లోని నెల్లిమర్ల లేదా చీపురుపల్లి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలి అనుకుంటున్నారు. ఆ లెక్కన చూస్తే విశాఖ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు అనుకుంటున్న ఇద్దరు వచ్చే ఎన్నికల నాటికి అందుబాటులో వుండరు. మరి అప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు ?
విశాఖ జిల్లాలో ఏర్పడే ఈ నాయకత్వ లేమి సమస్యని పరిష్కరించడానికి టీడీపీ హైకమాండ్ ఇప్పటికే ఓ పక్కా ప్లాన్ రెడీ చేసింది. పార్టీ కి దూరమైన దాడి వీరభద్రరావు ని తిరిగి పార్టీలో చేర్చుకోవడంతో పాటు మాజీ ఎంపీ సబ్బం హరి ని కూడా టీడీపీ లోకి ఆహ్వానించి ఆయనకు పెద్ద పీట వేయాలనుకుంటోంది. ఈ క్రమంలో విశాఖ ఎంపీ టికెట్ ను ఆయనకు ఆఫర్ చేసింది. పార్టీకి సంబంధించిన ఇతర అంశాల్లో కూడా క్రియాశీలంగా వుండాలని కోరుతోంది. అయితే ఈ రెండు ఆఫర్లను సబ్బం సున్నితంగా వద్దన్నారట. తనకు వచ్చిన ఆఫర్లకు తానే కోత పెట్టుకున్నారంట. విశాఖ ఎంపీ టికెట్ బదులు నగరంలో ఏదో ఒక అసెంబ్లీ టికెట్ ఇస్తే చాలని చెప్పారట. ఇక పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలంగా వుండే బదులు మీడియాలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తానని చెప్పారట. ఎవరైనా రాజకీయాల్లో ఇంకా ఇంకా ఎదగాలి అనుకుంటారు. కానీ సబ్బం మాత్రం విలక్షణ నేత అనిపించుకున్నారు. నాకు అంతొద్దు ఇంత చాలని టీడీపీ హైకమాండ్ కి చెప్పుకున్నారన్న విషయం ఇప్పుడు విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్.