వచ్చే ఏడాది రోడ్ సేప్టీ టీ20 సిరీస్‌లో మళ్లీ సచిన్, సెహ్వాగ్ ఆడబోతున్నారు.2013లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్ ఇండియా లెజెండ్స్ టీమ్ తరఫున ఇపుడు అడనున్నారు. 2020లో ఫిబ్రవరి 2నుంచి 16వరకూ భారత్ వేదికగా రోడ్ సేప్టీ టీ20 వరల్డ్ సిరీస్ జరగబోనుంది. సచిన్, సెహ్వాగ్‌లతో పాటు క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఆటగాళ్లు కూడా ఆడబోనున్నారు.మాజీ ఆటగాళ్ల ఒక్కో జట్టు భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ నుంచి రానుంది.
ఈ“రోడ్ సేప్టీ వరల్డ్ సిరీస్”ని మహారాష్ట్ర రోడ్డు భద్రత విభాగం ఇంకా పీఎంజీ సంయుక్తంగా రహదారి భద్రతపై అవగాహన కొరకి నిర్వహించబోనున్నాయి. రిటైర్మెంట్ ప్రకటించిన ఐదు దేశాల క్రికెట్ ఆటగాళ్లు పోటీపడనున్నారు.ఇండియా లెజెండ్స్,శ్రీలంక లెజెండ్స్,వెస్టిండీస్ లెజెండ్స్,దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా లెజెండ్స్ గా జట్లపేర్లని ఖరారు చేశారు. అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే జరగనున్నాయి. టోర్నీ నిర్వాహకులు ఆటగాళ్లతోనూ చర్చలు జరుపుతూ ఇప్పటికే భారత్ నుండి సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఖరారు చేశారు.ఆస్ట్రేలియానుండి బ్రెట్‌లీ, శ్రీలంక నుండి ముత్తయ్ మురళీధరన్ మరో ఆటగాడు తిలకరత్నె దిల్షాన్, వెస్టిండీస్ నుండి బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా నుండి జాంటీ రోడ్స్ ఆడనున్నట్టు సమాచారం.