రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి20 లీగ్ పేరుతో జరగనున్న కొత్త లీగ్ లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ ఆటగాళ్లు ఆడబోనున్నారు 2020 ఫిబ్రవరి 2నుంచి 16వరకు జరగబోనున్న ఈ టోర్నీ వేదికగా ముంబై, పుణే నగరాల పేర్లు ఖరారుఅయ్యాయి.వివరాలను ప్రకటిస్తూ కార్యక్రమంలో మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, బ్రెట్ లీ, జాంటీ రోడ్స్ పాల్గొన్నారు. లీగ్‌కు కమిషనర్‌గా బ్యాట్స్ మన్ సునీల్ గవాస్కర్ పేరు ప్రకటించారు.
పది మ్యాచ్‌లు జరగనున్న తరుణంలో మొత్తం ఎనమిది టీంలు ఇండియా లెజెండ్స్, ఆ్రస్టేలియా లెజెండ్స్, దక్షణాఫ్రికా లెజెండ్స్,శ్రీలంక లెజెండ్స్,వెస్టిండీస్ లెజెండ్స్ జట్లు ఇందులో పాల్గొంటు,75 మాజీ క్రికెటర్లు ఇందులో ఆడనున్నట్లు వెల్లడించారు.
మొదటి రెండు స్థనాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్మ్యాచ్ జరుగుతుంది. భారత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్లు ఆడబోతు, టీం కి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సారథిగా వ్యవహరించబోనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి20 లీగ్‌లో రానున్న ఆదాయాన్ని రోడ్డు భద్రత అవగాహన కోసం విరాళంగా “శాంత్ భారత్ సురక్షిత్ భారత్” అనే సంస్థకు విరాళంగా ఇవ్వబోనున్నట్టు సమాచారం.