దళపతిగా అభిమానుల చేత పిలవబడే తమిళ హీరో విజయ్ నటిస్తున్న సర్కార్ చిత్రం కాపీ వివాదాలను దాటుకొని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలలో నవంబర్ 6 న విడుదలవబోతుంది. ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కార్పొరేట్ మాన్స్టర్ అంటూ విభిన్న పాత్రలో నటిస్తున్న విజయ్, దేశ రాజకీయాల్లో ఓటు హక్కు విలువ చాటిచెప్పేలా ఈ సినిమా కథాంశం ఉంటుందని తెలుస్తుంది.
అయితే, తమ అభిమాన హీరో సినిమాని మార్నింగ్ షో కంటే ముందే ప్రీమియర్ షో లలో చూసెయ్యాలని ఆరాటపడుతున్న విజయ్ అభిమానులకి తమిళనాడు ప్రభుత్వం చేదు వార్త ని ఇచ్చింది. దీపావళి రోజున విడుదలవుతున్న ఈ సినిమాకి ప్రీమియర్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు నిలిపివేశారు. పండుగ రోజున సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తాయనే ఆలోచనతో నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిలిపివేసింది. దీనితో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న విజయ్ అభిమానులందరూ తీవ్ర నిరుత్సాహంలో మునిగితేలుతున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ రాజకీయ నాయకురాలిగా ముఖ్యపాత్రను పోషిస్తుంది.