Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సదావర్తి భూముల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ భూములకు ఆరు వారాల్లోగా బహిరంగ వేలం వేయాల్సివస్తోంది. ఆ విధంగా హై కోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సదావర్తి భూముల వ్యవహారం ఎన్నో ఆసక్తికర మలుపులు తిరిగింది.
చెన్నై సమీపంలో వున్న సదావర్తి భూములని 22 .50 కోట్లకి ఓ వ్యక్తికి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలం నిర్వహించింది. అయితే అందులో అక్రమాలు జరిగాయని ఆ భూములకు అంతకంటే ఎక్కువ ధర వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుని ఆశ్రయించారు. దీంతో ప్రస్తుత ధర కన్నా ఓ 5 కోట్లు ఎక్కువ ఇస్తే ఆళ్లకే భూములు అప్పగిస్తామని సర్కార్ తరపు న్యాయవాది వాదించారు. ఆ ప్రతిపాదనకు కోర్టు ఓకే అనడంతో ఆర్కే ఆ భూముల్ని 27 .50 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు ఈ భూముల విలువ 1000 కోట్ల దాకా ఉంటుందని సాక్షి పత్రిక, వైసీపీ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ ఆ భూములు చివరకు 27 .5 కోట్లకు అమ్ముడుపోవడంతో అల్ ఇండియా బ్రాహ్మణ సంఘం ఈ కేసులో ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. సదావర్తి భూముల్ని బహిరంగ వేలం వేయాలని, అప్పుడు ఎక్కువ విలువ వస్తుందని కోర్టుని కోరింది. ఇందుకు అంగీకరించిన కోర్టు ఆరు వారాల్లోగా ఈ భూములు బహిరంగ వేలం నిర్వహించాలని అందులో ఎమ్మెల్యే ఆర్కే కూడా పాల్గొనవచ్చని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.
మరిన్ని వార్తలు: