సాహో ట్రైలర్….అరిపించేశాడుగా !

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సాహో’ ట్రైలర్ వచ్చేసింది. ప్రభాస్-శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘సాహో’ ట్రైలర్ హాలీవుడ్ సినిమాని తలపిస్తోంది.

ముంబైలో జరిగిన 2 వేల కోట్ల దోపిడీ కేసును చేధించే అండర్ కవర్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృతా నాయర్ పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తోంది.ప్రభాస్-శ్రద్ధ మధ్య రొమాన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో హింట్ ఇచ్చారు.

హీరోహీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ కూడా రిచ్‌ గా ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్లను అంతమొందించే అండర్ కవర్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ చేసే యాక్షన్ సన్నివేశాలు సాహో సినిమాకు కీలకం అని చెప్పొచ్చు.

‘గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది.’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది.  అండర్ వాటర్ ఫైట్స్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు కనిపిస్తోంది. మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.