Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, వివి వినాయక్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వినాయక్ ఈ చిత్రానికి ముందు ‘ఖైదీ నెం.150’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. దాంతో దర్శకుడిపై నమ్మకంతో నిర్మాత సి కళ్యాణ్ ‘ఇంటిలిజెంట్’ చిత్రానికి అడ్డు అదుపు లేకుండా ఖర్చు పెట్టేశాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు ఉన్న క్రేజ్‌కు తోడు వినాయక్ బ్రాండ్ ఇమేజ్‌తో సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఏకంగా 30 కోట్ల ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రమోషన్స్ పేరుతో మరో నాలుగు అయిదు కోట్లను నిర్మాత ఖర్చు చేస్తున్నాడు.
వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెం.150 చిత్రం అంత పెద్ద విజయానికి కారణం ఏంటీ అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆ సినిమా చాలా రొటీన్‌గా ఉన్నా కూడా చిరంజీవి స్టామినాతో భారీ విజయం సాధించింది. వినాయక్‌కు ఆ సినిమా క్రెడిట్ పెద్దగా దక్కలేదు. అందుకే ఆ చిత్రం తర్వాత వినాయక్‌కు చాలా గ్యాప్ వచ్చింది. ఇక తేజూ గత మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లాపడ్డాయి.
వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే 20 కోట్ల వరకు ఖర్చు చేస్తే సేఫ్ ప్రాజెక్ట్. అంతకు మించి ఖర్చు చేయడంతో ‘ఇంటిలిజెంట్’ రిస్కీ ప్రాజెక్ట్ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అయితే తప్ప 30 కోట్లు రికవరీ అవ్వవు అంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా ట్రైలర్ మరియు పోస్టర్స్ చూస్తుంటే ఆ స్థాయి విజయాన్ని దక్కించుకోవడం అనుమానమే అంటూ సినీ వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.