అది నువ్వనుకుంటే సరిపోతుందా తేజూ?

sai dharam tej talks on tej i love u movie

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ గత రెండు సంవత్సరాలుగా సక్సెస్‌ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఎంతగా ప్రయత్నించినా, ఎన్ని సినిమాలు చేసినా కూడా సాయి ధరమ్‌ తేజ్‌కు మాత్రం కమర్షియల్‌ సక్సెస్‌లు దక్కడం లేదు. తాజాగా ‘ఇంటిలిజెంట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో అట్టర్‌ ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రంతో వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రం ఈనెలలోనే విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాను ఆలస్యం చేస్తున్నారు. సినిమా విడుదల ఆలస్యం అవుతున్నా కూడా సినిమా ప్రమోషన్స్‌ మాత్రం ఆపకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు దేవస్థానాు తిరుగుతూ దైవ ప్రార్థనలు చేస్తున్నారు.

తాజాగా ఒక మీడియా సమావేశంలో తేజూ సినిమా గురించి మాట్లాడాడు. సినిమా ఆహా, ఓహో అంటూ గొప్పలు చెప్పాడు. అది సరే అనుకున్నారు, కాని చివర్లో తాను తన మేనమామ చిరంజీవి పోలీకలతో ఉంటాను అని, చిరంజీవి గారి పోలికలు రావడం నా అదృష్టం అంటూ తేజూ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే మీడియా వారు తేజూలో అంతగా చిరంజీవి పోలికలు ఏమీ ఉండవని, ఆయనకు ఆయనే ఊహించుకోవడం ఏంటని గుసగుసలాడుకోవడం కనిపించింది. మేనమామ పోలికలు తేజూకు పెద్దగా రాలేదని, అయితే తేజూకు మేనమామ స్టైల్‌లో కనిపించడం అంటే ఇష్టం కనుక, కాస్త ఆ స్టైల్‌ను ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాడు. అందుకే చిరంజీవి మొదటి బిరుదు అయిన సుప్రీం హీరోను తేజూకు ఇవ్వడం జరిగిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి పోలికలతో తాను ఉంటాను అంటూ తేజూ చేసిన ప్రకటన ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చకు తెర లేపింది. తేజూ సొంతంగా ఎలా అనుకుంటాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.