నిజంగా హీరో అనిపించుకున్నాడు

Vijay Deverakonda is auctioning his first Filmfare Award.

ఏ హీరోకు అయిన కెరీర్‌లో మొదటి అవార్డు వచ్చినప్పుడు దాన్ని జీవితాంతం భద్రంగా దాచుకుంటాడు. ఆ అవార్డు తర్వాత ఎన్ని అవార్డులు వచ్చినా కూడా మొదటి అవార్డును మాత్రం అంతే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. పైగా ఆ అవార్డు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అయితే ఇక ఆనందానికి అవదులు ఉంటాయా చెప్పండి, కాని యువ హీరో విజయ్‌ దేవర కొండ మాత్రం తనకు వచ్చిన అవార్డును తృణప్రాయంగా సేవా కార్యక్రమం కోసం వినియోగించేందుకు సిద్దం అవుతున్నాడు. ఉత్తమ హీరోగా అవార్డును దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ఆ అవార్డును వేలం వేసేందుకు సిద్దం అవుతున్నాడు. వేలం ద్వారా వచ్చిన మొత్తంను సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించుకున్నాడు.

ఆ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించిన విజయ్‌ దేవరకొండ ప్రతి రోజు ఎంతో మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా సాయం చేయడం తనకు నచ్చిందని, అందుకే తాను కూడా అవార్డును వేం వేసి వచ్చిన మొత్తంను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా తాను కూడా అంతో ఇంతో హెల్ప్‌ చేసి కొందరిని అయినా ఆదుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. విజయ్‌ దేవరకొండ తీసుకున్న నిర్ణయంకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇలాంటి వ్యక్తి నిజంగానే హీరో అంటూ రాజకీయ వర్గాల వారు కూడా అంటున్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంకు ఏంతో కొంత సాయంగా నిలవాలనే ఉద్దేశ్యంతో విజయ్‌ దేవరకొండ తన అవార్డును వేలం వేసేందుకు సిద్దం అవ్వడం అభినందనీయం అంటూ మంత్రి కేటీఆర్‌ కూడా అన్నారు.