Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘ప్రేమమ్’ చిత్రంతో మలయాళ ప్రేక్షకులను, ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మైమరపించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాలు చేస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలకు మాత్రమే ఓకే చెబుతూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి మరోసారి సాహసం చేసేందుకు సిద్దం అవుతుంది. గతంలో ప్రేమమ్ చిత్రంలో మేకప్ లేకుండా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన సాయి పల్లవి మరోసారి మేకప్ లేకుండా కనిపించాలని ఫిక్స్ అయ్యింది.
తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కబోతున్న ‘మారి 2’ చిత్రంలో సాయి పల్లవి మేకప్ లేకుండా కనిపించబోతుంది. ఈతరం హీరోయిన్స్‌లో ఏ ఒక్కరు కూడా మేకప్ లేకుండా కనీసం బయటకు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపించరు. కాని సాయి పల్లవి మాత్రం ఏకంగా సినిమాల్లోనే మేకప్ లేకుండా నటించేందుకు ఆసక్తి చూపుతుంది. తనకు మేకప్‌తో కంటే తన సహజ రూపంతో కనిపించడమే ఇష్టం అని, మేకప్ లేకుండా నటించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఈతరం హీరోయిన్స్‌లో సాయి పల్లవిలా ఆలోచించే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మేకప్ లేకుండా ప్రయోగాత్మక పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న సాయి పల్లవి ముందు ముందు సౌత్ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం ఖాయం.