అక్కినేని నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు ఈ సినిమాలో రమ్య కృష్ణ శైలజా రెడ్డి (అత్త) పాత్రలోమెరవనుంది. ఇవాళే ఈ సినిమాకు సంబంధించి రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. చైతు ఇందులో అల్ట్రా స్టైలిష్ గా ఉండగా, మరొకదానిలో అత్తయ్య రమ్య కృష్ణ కోపంగా చూస్తుంటే అనుతో చైతన్య చనువుగా ఉన్నాడు. పోస్టర్ అయితే ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. ఇప్ప్పటి దాకా లవ్ స్టోరీస్ లో మాత్రమే నటించిన చైతు మొదటి సారి మంచి మాస్ టచ్ ఉన్న అల్లుడు పాత్ర చేస్తున్నాడు.
అత్తలను ఆటపట్టించే అల్లుడిగా నాగార్జున చేసిన అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు లాంటి సినిమాలు అప్పట్లో సూపర్ హిట్స్ గా ఫ్యాన్స్ ని అలరించాయి. వాటిని తలదన్నే రీతిలో శైలజారెడ్డి అల్లుడు ఉండబోతోందని ఈ సినిమా మీద అక్కినేని అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ స్టోరీ లైన్ అందరు ఊహించిందే అయినా టాలీవుడ్ కి అచ్చొచ్చిన అత్తా-అల్లుళ్ళ ఫార్ములా గనుక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది. ఆగష్టు చివరలో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఎప్పుడొస్తాయన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.