గ్రహణాలపై పై మహర్షులు ఇలా చెప్పారు

Saints Description to Eclipses
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మన మహర్షులు ఈ ఫలితాలను మనలను భయపెట్టే ఉద్దేశ్యంతో తెలుపలేదు. ప్రారబ్ధాన్ని దైవపూజ,దానము ఇత్యాది పురుషప్రయత్నా లద్వారా నివారణ లేక ఉపశమనం పొందవచ్చన్న గొప్ప సత్యాన్ని అందివ్వటమే వారి ఆశయం. కనుక ఆ విషయాన్ని మీ ముందు ఉంచటం జరిగింది.

కావున గ్రహణ శాంతి సశాస్త్రీయంగా జరిపించుకోవటం శ్రేష్ఠం.
శాంతి స్నానమును🤽‍♀ఇలా చేసిన దోషం నివృత్తి అవుతుందని మహర్షులు వచనం గా గ్రంధాధారంగా తెలియవస్తున్నది.*
శ్లో.పాధ:శమీకోకనదైరనిష్టే
విధూపరాగే తిలదారు వర్ణై:!
సిద్దార్ధదూర్వామధుకాలమేయై
రనిష్టనాశాయ తు మజ్జనం స్యాత్!!
*తాత్పర్యం:-దుష్టస్థానమున చంద్రగ్రహణం పట్టినచో నీరు,జమ్మి,ఎర్రకలువలు,నువ్వులు,దేవదారు,కేసరము,తెల్లాఆవాలు,గరికలు,తేనే,నాగకేసరములు కలిపి స్నానం చేసిన దోష విముక్తి కల్గును.*
     
 గ్రహణాన్ని సామాన్యంగా ఏ రాశివారు కూడా నేరుగా చూడరాదు. గ్రహణ దోషం ఉన్న రాశివారు పొరపాటున కూడా వీక్షించ రాదు.
****ఇక ఏ గ్రహణం వొచ్చినప్పటికి అందరూ పాటించ వలసిన సాధారణ నియమాలు ****
శ్లో.గ్రహణే సంక్రమణేవాసి, నస్నాయాద్యది మానవః
సప్తజన్మని కుష్ఠిస్యాత్‌, దుఃఖభాగేచ జాయతే||
*తా.గ్రహణకాలమునగాని, సంక్రమణ కాలాదులలోగాని, స్నానము చేయనివారు, ఏడుజన్మల పర్యంతము కుష్ఠురోగాది బాధలతో, దుఃఖితులైయుందురు.*
“రాత్రో స్నానం నకుర్వీత” అను నిషేధం ప్రకారం *ప్రతిదినము రాత్రికాలమున స్నానము చేయరాదు.*
నైమిత్తికంతు కుర్వీత స్నానం దానంచ, రాత్రిషు
*అను ధర్మము ప్రకారము ఏదేని గ్రహణాదికారణములు నిమిత్తముగ చేసికొని  రాత్రి కాలమున  స్నానాదులు చెయవచ్చును.*
*రాజ్యాభిషేక (ప్రమాణ స్వీకారం) నక్షత్రంలో గ్రహణం పడితే రాజ్య భంగం, బంధు క్షయం, మరణతుల్య కష్టాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్ధులు ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రవేశించిన నక్షత్రాన్ని గుర్తు పెట్టుకొని ఉద్యోగ, వ్యాపార కాలంలో ఆ నక్షత్రంలో గ్రహణం పడితే శాంతి చేసుకోవటం మంచిది.*    
 
*గ్రహణ సమయమున దేవత అర్చనలు, దైవ ధ్యానము, జపతపాదులు చేయడం క్షేమము. గ్రహణ సమయంలో రాహుకేతువులతో సూర్యచంద్రుల కాంతులు మిళితమయ్యి, అనేక విషకిరణాలు ఉద్భవిస్తాయి.*
*అవి చాలావరకూ మానవ నిర్మాణానికి ఇబ్బందులను కలిగిస్తాయి. ఎంతో సున్నితంగా ఉండే స్త్రీ గర్భంలోని శిశువుకు హాని కలగకూడదని గ్రహణం చూడొద్దంటారు.*
*గ్రహణ సమయంలో మానవ ప్రయత్నముగా గర్భవతులు దైవధ్యానమే శ్రేయస్కరము.*
*గ్రహణం సంభవించినపడు విడుదల అయ్యే కిరణాలు ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని, మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. ఆ కిరణాలు ఎక్కడికైనా చొచ్చుకు పోతాయి కాబట్టి గ్రహణ సమయంలో వండటం, తినడం లాంటివి చేయకూడదు అంటారు. నిద్ర,భోజనం,మలమూత్ర విసర్జన, స్త్రీసహవాసము కూడవు.*
“ఆరనాలం చ,తక్రంచ పాథేయం,
ఘృతపాయసం!
ఉదకం చ కుశచ్చన్నం,
న దుష్యేద్రాహుదర్శనే!!
ఇతివచనాత్ దర్భయుక్తం ఉదకాదికం గ్రాహ్యమేవ”–వ్యాస వచనం.
 *గ్రహణానికి ముందు వండిన పదార్థాలు గ్రహణానంతరం తినకూడదు.*
*అయితే, గ్రహణానికి ముందు ఉన్న నూనె పదార్థాలు, గంజి, మజ్జిగ, అలాగే ముందు నూనె/నెయ్యి తో వండిన పదార్థాలపై దర్భ ఉంచితే  పనిచేస్తాయి.* 
*ఆరోజు_పగలంతా_భోజనం_చేయరాదు.*
“గ్రస్తోదయే విధోః పూర్వం నాహర్భోజనమాచరేత్”  అన్న వృద్ధవాసిష్ఠ వచనాన్ని విద్యారణ్యులు తమ కాలమాధవం లో ఉటంకించారు. విద్యారణ్యులు తన మాటగా , “పాపక్షయకామో గ్రహణదినముపవసేత్ ” అని వ్రాసారు. అందువల్ల *పాపక్షయం కోరుకునేవారంతా ఆరోజంతా ఉపవాసముండాలి.* ఇక మనువు చెప్పిన 
చంద్రసూర్యగ్రహే నాద్యాదద్యాత్స్నాత్వా విముక్తయోః 
అన్న వాక్యానుసారం *రాత్రి గ్రహణ మోక్షానంతరం స్నానం చేసి శుద్ధబింబాన్ని చూసి భోజనం చేయవచ్చును.*   
*అలాగే బాలులు, వృద్ధులు, గర్భిణులు మధ్యాహ్నం గం.12-00 వరకూ ( ద్వితీయ యామాంతం) ఆహారం తీసికొనవచ్చును.