సాక్షికి జేమ్స్ బాండ్స్ కావాలి.

sakshi journalists focus on TDP party leaders at Kakinada

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సాక్షి పత్రిక, ఛానల్ లో పని చేసే జర్నలిస్టులు జేమ్స్ బాండ్స్ తరహాలో ఉండాలి. అదేంటా అని ఆశ్చర్యపోకండి. ఇది వాళ్ళో వీళ్లో చెబుతున్న మాట కాదు. సాక్షాత్తు సాక్షిలో పని చేస్తున్న విలేకరులు చెబుతున్న మాట. నంద్యాల, కాకినాడ ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ పెద్ద ఎత్తున తమ నాయకులని అక్కడ మకాం వేయించారు. అది సర్వ సాధారణం. కానీ వైసీపీ తరపున ఆ పార్టీ నాయకులతో పాటు సాక్షి సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇందులో కూడా పెద్ద తప్పేమీ లేదు. కానీ అలా రంగంలోకి దిగిన సాక్షి విలేకరులు టీడీపీ కి వ్యతిరేకంగా ఏదో ఒక రహస్యాన్ని రోజువారీగా బద్దలు కొట్టాలని యాజమాన్యం ఆశిస్తోంది. ఆ టార్గెట్ తో నంద్యాల, కాకినాడల్లో ఒక్కో చోట 50 మంది కి పైగా జర్నలిస్టులు మఫ్టీ లో వున్న పోలీస్ అధికారుల మాదిరి టీడీపీ కార్యాలయం, నాయకుల ఇళ్ల దగ్గర మోహరించారు.

ఇలా మోహరించిన విలేకరులు ప్రతి రోజు ఏదో ఒక టీడీపీ వ్యతిరేక సంచలన వార్త ఇవ్వాలని టార్గెట్ పెట్టారు. అది సాధ్యం కాదని అర్ధం చేసుకోని యాజమాన్యంతో విలేకరులు నానా అగచాట్లు పడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన లక్ష్యాలు పూర్తి చేయాలంటే కావాల్సింది విలేకరులు కాదు జేమ్స్ బాండ్స్ అని సదరు జర్నలిస్టులు గొణుక్కుంటున్నారు.

మరిన్ని వార్తలు:

200 నోట్లు వచ్చేది ఎప్పుడంటే ?

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌

ఆ సెక్స్‌ రాకెట్‌తో ఇద్దరు సినీ ప్రముఖులకు సంబంధం!