సాక్ష్యం ముందు మెగా మూవీ తేలిపోయింది

Sakshyam Movie collections better than Happy Wedding movie collection

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కిన ‘సాక్ష్యం’ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద బడ్జెట్‌ చిత్రం అవ్వడంతో పాటు, భారీ ఎత్తున పబ్లిసిటీ చేసిన కారణంగా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. దాంతో సహజంగానే మంచి ఓపెనింగ్స్‌ దక్కాయి. అయితే సినిమా అటు ఇటు అయితే ఖచ్చితంగా కలెక్షన్స్‌ దారుణంగా ఉండేవి. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ దక్కినందువల్లే భారీ ఎత్తున వసూళ్లు సాధ్యం అయ్యాయి. ఈ చిత్రానికి పోటీగా పెద్ద చిత్రాలు ఏమీ లేకపోవడం వల్ల కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చింది. ‘సాక్ష్యం’ చిత్రం విడుదలైన ఒక్క రోజుకు మెగా డాటర్‌ నిహారిక ‘హ్యాపీవెడ్డింగ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా హ్యాపీ వెడ్డింగ్‌కు కలెక్షన్స్‌ రావడం లేదు.

‘సాక్ష్యం’ చిత్రం ముందు హ్యాపీవెడ్డింగ్‌ చిత్రం నిలవడంలో విఫలం అయ్యింది. భారీ బడ్జెట్‌ చిత్రం అవ్వడంతో పాటు, మాస్‌ ఎలిమెంట్స్‌ విచ్చలవిడిగా ఉన్న కారణంగా సాక్ష్యం చిత్రానికి ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఒక రెగ్యులర్‌ ఫ్యామిలీ, క్లాస్‌ చిత్రంగా ఉన్న కారణంగా హ్యాపీవెడ్డింగ్‌కు పెద్దగా వసూళ్లు నమోదు అవ్వడం లేదు. బి, సి సెంటర్లలో సాక్ష్యం దుమ్ము రేపుతుంటే, మల్టీప్లెక్స్‌లలో మాత్రం సాక్ష్యం చిత్రం ఆకట్టుకుంటూ ఉంది. మల్టీప్లెక్స్‌ చిత్రంగా ఈ చిత్రానికి పేరు పడిపోయింది. దాంతో మాస్‌ ఆడియన్స్‌ ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. సాక్ష్యం చిత్రం లేకుంటే ‘హ్యాపీవెడ్డింగ్‌’ చిత్రం మంచి వసూళ్లను రాబట్టేదని, బెల్లంకొండ శ్రీనివాస్‌ హ్యాపీవెడ్డింగ్‌కు దెబ్బ వేశాడు అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.