సేఫ్‌ గేమ్‌ ఆడబోతున్న నాగార్జున..!

samantha and nagarjuna new film raju gari gadhi2 release on october 13

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏ హీరో అయితే తన క్రేజ్‌ను, ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తాడో ఆ హీరో ఖచ్చితంగా సక్సెస్‌ అవుతాడు. అలా కాదని తన క్రేజ్‌కు తగ్గట్లుగా కాకుండా భారీ ఎత్తున ఖర్చు చేయించి సినిమాలు చేయడం వల్ల ఖచ్చితంగా బొక్క బోర్లా పడుతూ ఉంటాడు. అతి కొద్ది మంది హీరోలు మరియు నిర్మాతలు మాత్రమే సినిమా స్థాయి, అందులోని వారి స్టామినా బట్టి ఖర్చు చేస్తూ ఉంటారు. అలాంటి ఒక హీరో, నిర్మాత నాగార్జున పేరు చెప్పుకోవచ్చు. ఈయన ఏం చేసినా కూడా పర్‌ఫెక్ట్‌గా చేస్తాడు. తన స్థాయికి తగ్గట్లుగా సినిమాలు చేస్తాడు. తన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ, నిర్మాతలను కాపాడుతూ ముందుకు సాగుతున్నాడు.

తాజాగా నాగార్జున నటించిన చిత్రం ‘రాజుగారి గది 2’. ఈ చిత్రానికి ఓంకార్‌ దర్శకత్వం వహించగా ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మించాడు. ఈ సినిమాకు చిన్న బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొదటి పార్ట్‌ మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో రెండవ పార్ట్‌పై సహజంగా అంచనాలు భారీగా ఉండటం కామన్‌. అందుకే రాజుగారి గది సక్సెస్‌ అవ్వడంతో ఆ సినిమాతో ఈ సినిమాకు సంబంధం లేకుండా 2 జత చేసి ‘రాజు గారి గది 2’ అంటూ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను మొదట దసరాకు విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని స్టార్‌ హీరోలు, పెద్ద సినిమాలతో పోటీ ఎందుకు అనే ఉద్దేశ్యంతో వాయిదా వేయడం జరిగింది.

సమంత ముఖ్య పాత్రలో నటించిన ‘రాజు గారి గది 2’ చిత్రం ఈనెల 13న విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాకు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్‌ టాక్‌ సింపుల్‌గా బాగుందని వచ్చింది. దాంతో సినిమా ఖచ్చితంగా కలెక్షన్స్‌ను రాబడుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దసరాకు విడుదలైన మూడు సినిమాల్లో ఒకటి రెండు మాత్రమే ఆకట్టుకున్నాయి. దాంతో ప్రేక్షకులు కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న రెండు సినిమాలు విడుదలైన కూడా అవి సోదిలో కూడా లేకుండా పోయాయి. ఇక రాబోతున్న సినిమా రాజుగారి గది అవ్వడంతో అంచనాలు, ఆసక్తి భారీగా ఉంది. వారం రోజులు మంచి కలెక్షన్స్‌ను సాధిస్తే నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట ఖాయం అని అంటున్నారు. మొత్తానికి నాగార్జున ఎలాంటి రిస్క్‌ లేకుండా సేఫ్‌గా ఈ సినిమాను విడుదల చేయబోతున్నాడు.