Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభిమన్యుడు’ చిత్రాలతో సక్సెస్‌లను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈమె ‘రంగస్థలం’ మినహా మిగిలిన రెండు సినిమాలకు కూడా సొంతంగా డబ్బింగ్‌ను చెప్పుకుంది. ఇకపై కూడా వరుసగా తాను నటించబోతున్న సినిమాలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. గతంలో సమంత ఏ చిత్రంలో నటించినా కూడా చిన్మయి డబ్బింగ్ చెప్పేది. సమంత తెరపై కనిపించడంతో పాటు, చిన్మయి వాయిస్ వినిపిస్తేనే ఆ సినిమా సక్సెస్ అవుతుందని అందరికి అనిపిస్తుంది. ఆ భావన మార్చాలనే ఉద్దేశ్యంతోనే సమంత స్వయంగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. తాను చేస్తున్న, చేయబోతున్న సినిమాల కోసం దర్శకులను ఒప్పించి, బలవంతం చేసి డబ్బింగ్ చెప్పుకోబోతుంది.
తెలుగు వారి ఇంటి కోడలు అయిన సమంత మునుపటితో పోల్చితే తెలుగు పరిపూర్ణంగా మాట్లాడగలుగుతుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కూడా తెలుగు అమ్మాయి అయ్యింది. అందుకే తెలుగులో చేస్తున్న సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పాలని భావిస్తుంది. తెలుగు వారి ఇంటి కోడలు తెలుగులో డబ్బింగ్ చెప్పలేక పోతే బాగుండదనే ఉద్దేశ్యంతో పాటు, ఇటీవల డబ్బింగ్ చెప్పిన సినిమాలు సక్సెస్ అవ్వడం వల్ల కూడా ఈ అమ్మడు వరుసగా తన సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుంది. సమంత నిర్ణయంను కొందరు అభినందిస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం అన్ని సినిమాలకు కూడా సమంత డబ్బింగ్ చెప్పుకుంటే సూట్ అవ్వకపోవచ్చు అని, ఆమె నిర్ణయంను తప్పుబడుతున్నారు. మహానటి చిత్రంలో పాత్రకు నత్తి ఉంది కనుక సమంత మ్యానేజ్ చేసింది. అభిమన్యుడు సినిమాలో సమంత కనిపించింది కొద్ది సమయం కనుక డబ్బింగ్ పర్వాలేదు అనిపించింది. కాని ఫుల్‌లెంగ్త్ పాత్రలు చేసినప్పుడు, విభిన్నమైన పాత్రలు చేసినప్పుడు తెలుగులో డబ్బింగ్ చెప్తాను అంటే కష్టమే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.