లిప్ లాక్ పై క్లారిటీ ఇచ్చింది

Samantha gives Clarity on Liplock Kiss in Rangasthalam movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రంగస్థలం సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత తన సంతోషకర సమయాన్ని మీడియాతో పంచుకుంటూ కొన్ని విషయాలను తన అభిమానులకు తెలియపరిచింది. ఏమాయ చేశావే సినిమాతో ఇండస్ట్రి లో అడుగుపెట్టిన సమంతని -జెస్సి రోల్ అందనత ఎత్తుకు ఎదిగేల చేసింది. ఇప్పుడు మొదటి సారి తను నటించిన డీ గ్లామర్ పాత్ర పల్లెటూరి రామలక్ష్మి కి అదే తరహాలో సామ్ కు గుర్తింపు తెచ్చిపెట్టింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం తో చాలా కమేదిని పండించాడు.

ఇక హీరోహీరోయిన్ నటన తో పాటు ఈ సినిమాలో మరో హైలెట్ ఇంటర్వెల్ ముందు సామ్ -చరణ్ ల లిప్ లాక్. ఒక జర్నలిస్ట్ సమంతని మీకు పెళ్లయింది కదా లిప్ లాక్ ఎలా ఇచ్చారు అని ప్రశ్నించగా పెళ్ళయిన హీరో లిప్ లాక్ చేస్తే తప్పు లేనప్పుడు హీరోయిన్ ఇస్తే తప్పేముంది అని సమాధానమిచ్చింది. అయిన అది లిప్ లాక్ కాదు జస్ట్ చెర్రీ బుగ్గపై నేను ముద్దు పెట్టాను అది కెమెరా ట్రిక్ వలన లిప్ లాక్ లా కనిపిస్తుంది అని చెప్పింది. ఆ సీన్ లో చరణ్ కి ముద్దు పెట్టడం కరెక్ట్ అది ఆలోచించాకే నేను ఈ సీన్ కి ఒప్పుకున్నానని మీడియాకి, అభిమానులకి క్లారిటి ఇచ్చింది.