చైతూ, సమంతల రిసెప్షన్‌ విశేషాలు

Samantha Nagachaitanya wedding Reception date confirmed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం గత నెలలో గోవాలో వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. పెళ్లిని సన్నిహితుల సమక్షంలో మాత్రమే చేసుకున్న ఈ జంట త్వరలోనే రిసెప్షన్‌ ద్వారా అందరి ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే చెన్నైలో రిసెప్షన్‌ పూర్తి అయ్యింది. ఇక హైదరాబాద్‌లో తెలుగు సినీ ప్రముఖులు మరియు అక్కినేని ఫ్యాన్స్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కినేని నాగార్జున ఈ రిసెప్షన్‌ను దగ్గరుండి మరీ ప్లాన్‌ చేశాడు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఎన్‌ కన్వెన్షన్‌లో ఈ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

చైతూ, సమంతల రిసెప్షన్‌ విశేషాలు - Telugu Bullet

ఈనెల 12, ఆదివారం రోజున రిసెప్షన్‌కు ప్లాన్‌ చేశారు. పెళ్లి తర్వాత లండన్‌కు వారం రోజుల పాటు హనీమూన్‌ వెళ్లి వచ్చిన కొత్త జంట ప్రస్తుతం ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. పెళ్లి హడావుడి అంతా అయిపోయిన తర్వాత రిసెప్షన్‌ను ప్లాన్‌ చేశారు. ఇప్పటికే సినీ ప్రముఖులకు మరియు వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానాలు పంపించేందుకు లిస్ట్‌ను సిద్దం చేస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలోని వారు అంతా కూడా సన్నిహితంగా ఉంటారు. అందుకే ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్‌ మొత్తం తరలి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మరియు నందమూరి ఫ్యామిలీ ఈ రిసెప్షన్‌లో సందడి చేయనున్నారు. సమంత పలువురు స్టార్‌ హీరోలతో నటించిన నేపథ్యంలో వారు అంతా కూడా రిసెప్షన్‌లో కనువిందు చేయనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ రిసెప్షన్‌ జరుగనుంది.

చైతూ, సమంతల రిసెప్షన్‌ విశేషాలు - Telugu Bullet