Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు మరియు తమిళ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నాగచైతన్య, సమంతల వివాహం ఈనెల 6 మరియు 7వ తేదీన గ్రాండ్గా గోవాలో జరిగింది. 6వ తారీకున హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపగా, 7వ తారీకున క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహాన్ని చేసుకున్నారు. ఇలా రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవడం చాలా అరుదైన విషయంగా చెప్పుకోవాలి. అది కూడా రెండు రోజులు రెండు విభిన్న సాంప్రదాయాల పెళ్లిలు. సమంత, నాగచైతన్యల వివాహంపై సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా సాదారణ జనాలు మరియు మీడియా ఎంతో శ్రద్ద కనబర్చింది. సోషల్ మీడియాలో నాగచైతన్య, సమంతల వివాహం ఫొటోలు తెగ ట్రెండ్ అయ్యాయి. అంతా బాగానే ఉంది, కాని ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.
అదే సమంత కుటుంబ సభ్యులు ఎవరు ఈ పెళ్లికి హాజరు కాలేదు అని, సమంతకు అత్యంత ఆప్తులు అయిన కొందరు మిత్రులు మరియు శ్రేయోభిలాషులు మాత్రమే ఆమె తరపున గోవాలో జరిగిన పెళ్లికి హాజరు అయ్యారని, సమంత కుటుంబ సభ్యులు మాత్రం ఏ ఒక్కరు రాలేదు అంటూ ప్రచారం జరుగుతుంది. సహజంగా సమంత కుటుంబ సభ్యుల గురించి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మీడియాలో ప్రచారం జరగలేదు. వారు ఎలా ఉంటారు అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. అందువల్ల వారు పెళ్లికి వచ్చినా కూడా గుర్తించలేక పోవచ్చు. మీడియాకు విడుదల చేసిన ఫొటోల్లో, సోషల్ మీడియాలో విడుదలైన ఫొటోల్లో వారు ఉన్నా గుర్తు పట్టక పోవచ్చు లేదా వారి గురించి పెద్దగా బయట తెలియదు కనుక ఆ ఫొటోలను విడుదల చేసి ఉండకపోవచ్చు అని కొందరు అభిప్రాయం పడుతున్నారు.
సమంత కుటుంబ సభ్యులు వివాహానికి హాజరు అయ్యారా లేదా అనే విషయం క్లారిటీ రావాలి అంటే అక్కినేని లేదా దగ్గుబాటి ఫ్యామిలీ వారు స్పందించాలి. లేదంటే అక్కినేని సమంత అయినా స్వయంగా తన కుటుంబ సభ్యులు పెళ్లికి వచ్చారా, రాలేదు అంటే ఎందుకు రాలేదు అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.