గోవాలోనే ఎందుకు పెళ్లి చేసుకున్నామంటే..!

samantha-reveals-reasons-behind-on-marriage-in-goa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని హీరో నాగచైతన్య మరియు సమంతల వివాహం తాజాగా గోవాలో చాలా వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. అక్కినేని మరియు దగ్గుబాటి కుటుంబ సభ్యులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏ స్థాయిలో వీరిద్దరి వివాహం జరిగిందో మీడియాలో వస్తున్న ఫొటోలు మరియు వీడియోలను చూస్తుంటే అర్థం అవుతుంది. రెండు రోజుల పాటు చాలా వైభవంగా పద్దతిగా వీరి వివాహం జరిగింది. మొదటి రోజు పూర్తిగా హిందూ సాంప్రదాయం ప్రకారం, రెండవ రోజు పూర్తిగా క్రిస్టియన్‌ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. దాదాపు వారం రోజుల పాటు పెళ్లి సందడి రెండు కుటుంబాల్లో నెలకొంది. పెళ్లి సందడి తగ్గింది. తాజాగా సమంత మొదటి సారి మీడియా ముందుకు వచ్చింది.

పెళ్లి గోవాలో చేసుకోవడానికి కారణం ఏంటి, ఇతర సినీ ప్రముఖులను పిలవక పోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి అనే విషయాలపై తాజాగా సమంత ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పెళ్లి అనేది ఎక్కువ మంది ఉన్నప్పుడు చేసుకుంటే కంఫర్ట్‌గా అనిపించదు. అందుకే అత్యంత ఆప్తుల మద్య మాత్రమే వివాహాన్ని చేసుకోవాలని మొదటి నుండి మేము ప్లాన్‌ చేసుకున్నాం. పెళ్లికి వేల మంది రావాలని, ఆహ్వానించాలని మేము ఎప్పుడు అనుకోలేదు. అందుకే కేవలం సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యేలా మా పెళ్లిని గోవాలో సాంప్రదాయబద్దంగా చేసుకున్నాం. మా వరకు మాకు ఎప్పుడో పెళ్లి అయ్యింది. కాని సాంప్రదాయం అంటూ ఒకటి ఉంది, దాన్ని గౌరవించాలనే ఉద్దేశ్యంతో మేము పెళ్లి చేసుకున్నాం. మా ఊహల్లో, ఆలోచనల్లో పెళ్లి చేసుకున్నాం కాని పెద్దల కోసం సాంప్రదాయ బద్దంగా మరోసారి వివాహాన్ని చేసుకున్నామని చెప్పుకొచ్చింది.

సినిమాల్లో నటించడం మొదలు పెట్టినప్పుడే ఏదో ఒక సమయంలో సినిమాలకు స్వస్థి చెప్పాల్సి ఉంటుందనే ముందుగానే నిర్ణయించుకున్నాను. అయితే ఇప్పుడు మాత్రం నటించాలనే కోరిక బలంగా ఉంది. డబ్బులు, బ్యాంక్‌ బ్యాలన్స్‌ విషయాన్ని పక్కన పెడితే ఎప్పుడు నటిస్తూనే ఉండాలని ఉందని, పెళ్లి అయినంత మాత్రాన సినిమాలకు దూరంగా ఉండాలని తాను భావించడం లేదని సమంత పేర్కొంది.