ఆ ఎన్టీఆర్, కృష్ణ చేయలేనిది మహేష్ చేస్తాడా ?

Mahesh in Chhatrapati Shivaji biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా స్థానం ఏది అంటే తడుముకోవాలి. ఇది బాహుబలికి ముందు మాట. బాహుబలి తర్వాత తెలుగు సినిమా గౌరవం పెరిగింది. అయితే అంతకుముందు కూడా కొన్ని విషయాల్లో తెలుగు సినీ పరిశ్రమని ఫాలో అయ్యింది యావత్ చిత్ర సీమ. పౌరాణిక సినిమాల విషయంలో తెలుగు వాళ్ళు తీసిన సినిమాలే చాలా వరకు మిగిలిన భాషల వారికి దారి చూపించాయి. ఆ తర్వాత చారిత్రక సినిమా విషయంలో కూడా తెలుగు పరిశ్రమకి అంత గౌరవం తెచ్చిన సినిమా అల్లూరి సీతారామరాజు. ఈ పాత్ర తో సూపర్ స్టార్ కృష్ణకి భలే పేరు వచ్చింది. సినిమా కూడా భారీ విజయం సాధించింది. అయితే ఈ పాత్ర చేయడానికి ఎన్టీఆర్ కూడా అప్పట్లో ఉవ్విళ్ళూరారు. కానీ కృష్ణ చేసిన సినిమా సాధించిన విజయం చూసాక సైలెంట్ అయిపోయారు. ఈ సినిమా విషయంలో కొన్నాళ్ళు ఎన్టీఆర్, కృష్ణ మధ్య మాటలు లేకుండా పోయాయి. తర్వాత మ్యాటర్ సెటిల్ అయిపోయింది. కానీ ఇంకో గమ్మత్తు అయిన విషయం ఏమిటంటే ఏ పోటీ లేకపోయినా ఓ పాత్ర మీద మోజు పడ్డా ఈ ఇద్దరు కూడా ఛత్రపతి శివాజీ పాత్ర చేయలేకపోయారు. దానికి అనేక కారణాలు.

అలా శివాజీ సినిమా ఆలోచన కూడా ఈ మధ్య పెద్దగా వినిపించలేదు. బడ్జెట్, ఇతర పరిమితుల దృష్ట్యా ఆ సబ్జెక్టు టచ్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు. అయితే పరుచూరి పలుకులు పేరిట వెబ్ ఛానల్ లో సినిమాల మీద అభిప్రాయాలు చెబుతున్న గోపాల కృష్ణ కొత్తగా ఓ కోరిక కోరారు. ఛత్రపతి శివాజీ సినిమాని మహేష్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అసలే దర్శక దిగ్గజం రాజమౌళితో మహేష్ సినిమా అన్న వార్తలు సమయంలో ఇదే సబ్జెక్టు అయితే కాంబినేషన్ కి తగ్గట్టు ఉంటుందని ఘట్టమనేని అభిమానులు అనుకుంటున్నారు. చూద్దాం… పరుచూరితో పాటు అభిమానులు ఎందరో కోరుకుంటున్న ఈ సబ్జెక్టు తెరకి ఎక్కుతుందో, లేదో ?