దేవరకొండ స్టార్‌ అని తేల్చేసిన సమంత…!

Samantha Speech For Vijaydevarakonda

యువ హీరో నాగశౌర్య తాజాగా తన ‘నర్తనశాల’ చిత్రం విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీతోనే స్టార్‌డం అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా స్టార్‌డం అనేది రాదని, స్టార్‌ అవ్వాలనుకునే వారు అంత సులభంగా స్టార్‌ కాలేరు అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలు ఇండైరెక్ట్‌గా విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి అన్నవని, గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండ స్టార్‌ అయ్యాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో నాగశౌర్య పై వ్యాఖ్యలు చేశాడు. తన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన కారణంగా తాను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

samantha-speech

తాజాగా సమంత స్టార్‌డంపై కామెంట్‌ చేసి ఆ విషయాన్ని రైజ్‌ చేసింది. యూటర్న్‌ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సమంత మాట్లాడుతూ స్టార్‌డం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్కరితో ఆగిపోదు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి స్టార్‌డం అనేది వస్తూనే ఉంటుందని, కాకుంటే కాస్త అదృష్టం కూడా దానికి కలిసి రావాలి అంటూ చెప్పుకొచ్చింది. విజయ్‌ దేవరకొండ వంటి వారు ఎంతమందైనా మంచి సినిమాలతో వస్తే స్టార్‌లు అవ్వొచ్చు అంటూ చెప్పుకొచ్చింది. విజయ్‌ దేవరకొండతో ఈమె ‘మహానటి’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే విజయ్‌ దేవరకొండతో సమంతకు మంచి సన్నిహిత్యం ఏర్పడినది. ఆ కారణంగానే నాగశౌర్య కామెంట్స్‌కు కౌంటర్‌గా విజయ్‌కు మద్దతుగా సమంత కామెంట్స్‌ చేసిందనే టాక్‌ సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

samantha-speech-vijaydevara