తెలుగింటి కోడలు అనిపించుకోవాలని..!

Samantha wants to Own Dubbing for Mahanati Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లో ఇతర భాషల హీరోయిన్స్‌ ఎక్కువగా ఉంటారు. వారిలో ఒక్కరు ఇద్దరు తప్ప ఏ ఒక్కరు కూడా తమ పాత్రకు తాము స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోలేరు. దశాబ్దాల కాలంగా హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తున్నప్పటికి హీరోయిన్స్‌ మాత్రం తమ పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోలేరు. అయితే తాజాగా సమంత తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకునేందుకు సిద్దం అవుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘మహానటి’ చిత్రంలో సమంత ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆ పాత్రకు డబ్బింగ్‌ను స్వయంగా సమంత చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది.

గత కొంత కాలంగా సమంతతో డబ్బింగ్‌ చెప్పించాలని పలువురు దర్శకులు భావించారు. అయితే సమంత మాత్రం అందుకు సాహసం చేయలేదు. ఆ మద్య త్రివిక్రమ్‌ ఈమెతో డబ్బింగ్‌ చెప్పించాలని భావించి, కొన్ని కారణాల వల్ల వెనకడుగు వేశాడు. తాజాగా ఈమె అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యింది. తెలుగు వారి ఇంటి కోడలు అయిన సమంత తెలుగు తనకు పూర్తిగా వస్తుందని, ఏమాత్రం తడబడకుండా తెలుగు మాట్లాడతాను అంటూ నిరూపించుకునేందుకు మహానటి చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పాలని నిర్ణయించుకుంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కూడా సమంతతో డబ్బింగ్‌ చెప్పించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. సమంతకు డబ్బింగ్‌ ఇంత కాలం చిన్మయి చెబుతూ వస్తుంది. సమంత సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకునేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.